Mahabharat Place 2021 : మహాభారతం ఆధారాలు ఉత్తర భారతదేశం లో

mahabharat
Mahabharat Place :  ఈ ఆధారాలతో మహాభారతం తప్పక జరిగిందని నమ్మవలసిందే.

ప్రపంచంతో పోల్చుకుంటే భారతదేశం శతాబ్దాలుగా ఒక బంగారు చిలుకగా ఎదిగింది అని చరిత్ర కారులు చెప్తుంటారు. భారతదేశం అనేది ప్రపంచ మానవ తెన్నుతీరులను నిర్ధేశించింది. అత్యంత విశ్వాసనీయమైన దేశంగా ఎదిగింది. కానీ పశ్చిమ దేశాల ద్వారా దాని అస్థిత్వం పై కుట్ర జరిగినది.

ఆ బంగారు చిలుక రెక్కలు తెంచేందుకు ఆక్రమణ దారులు కుట్రలు చేశారు. తమ దేశాల చరిత్ర ల కన్నా ఎంతో ముందు నాగరికతను సంతరించుకున్న మన దేశ గొప్పదనాన్ని మెసబోటినీయ చరిత్ర లను దాటి ముందుకు రానివ్వలేదు.

ఈ 21 వ శతాబ్దం లో ఉత్తర భారతదేశం లో జరిగిన ఒక గొప్ప అన్వేషణ పేరే సినౌలి సీక్రెట్.

ఉత్తర భారతదేశం లో జరుగుతున్న త్రవ్వకాలు, అధ్యయనాల ద్వారా ఒక మహా చరిత్ర (Mahabharat) తనంతట తానే బయటకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

mahabharat

మూడు సంవత్సరాల పాటు లక్షకు పైగా శ్లోకాలతో వేద వ్యాస మహర్షి ద్వారా విరచితమయిన భారతం నిజంగానే జరిగిందనే వాదన కు బలం చేకూర్చే తిరుగులేని సాక్ష్యాలు ప్రపంచాన్ని విస్మయ పరుస్తున్నాయి.

భారతం, మనకు చరిత్ర ప్రసాదించిన ఒక మహా గ్రంథం (Mahabharat) . ఈ మహా గ్రంథాన్ని అర్థం చేసుకోవడం లో ఇప్పటికీ ఎవరి ఆలోచనలు వారివి.

1950 నుంచి 1960 వరకు ప్రచారం లో వెస్ట్రన్ థియరీ ద్వారా భారతదేశం చరిత్ర అణిచివేత కి గురయింది. చరిత్రను పక్కదారి పట్టించారు. ఇది చారిత్రక గ్రంథంగా గుర్తించకపోవడం, ఒక మతానికి సంబంధించినదిగా జరిగిన ప్రచారం కారణంగా ప్రపంచం కళ్ళు తెరవకముందే జరిగిన ఒక గ్రేట్ సివిలియన్ ఎపిక్ ను అవమానకర రీతిలో రామాయణం కు రంకు, అని భారతం బొంకు అన్న అర్థం లేని సామెతలను వ్యాప్తి లోకి తెచ్చి ఆ మహ గ్రంథాలను పుకిట పురణాలుగా తేల్చే ప్రయత్నం చేశారు.

mahabharat

ఈ మహాభారతం కావ్యంను వేద వ్యాసుడు చెప్పగా గణనాధుడే స్వయంగా రచించాడనే హిందువుల నమ్మకం, 18 పర్వాలు, లక్షకు పైగా శ్లోకాలతో ప్రపంచం లోనే అతిపెద్ద పద్య కావ్యంగా అలరారిన పంచమ వేదంగా మహాభారతం గుర్తింపు పొందింది.

ఈ గ్రంథాన్ని 14 వ శతాబ్దం లో కవిత్రంగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన మాత్యులు తెలుగులోకి అనువదించారు. ఇది స్థూలంగ మహాభారతం పరిచయం.

అఖండ భారతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా రామాయణం రంకు అని, భారతం (Mahabharat) బొంకు అర్థం లేని సామెతలను వ్యాప్తి చెందెలా చేశారు.

కథల్లోనూ, కావ్యాల్లోను నిజమయిన ప్రదేశాల పేర్లను ప్రస్తావించడం మనం గమనిస్తూ ఉంటాం. త్రవకాల్లో బయటపడిన ఆధారాలను పరిశోదిస్తే ఆ ప్రదేశాలు సదరు రచనలలో రాసినట్లు గా ఉంటాయి.

mahabharat

క్రీస్తు పూర్వం రెండువేల సంవత్సరాలు వరకు ఆర్యుల భాష అయిన సంస్కృతం భారతదేశం లో లేదని మహాభారతం (Mahabharat) లో సన్నివేషాలు కల్పితాలు అంటూ ఒక పెను ప్రచారం జరిగినది, కానీ తాజాగా బయటపడిన రహస్యాలు అసలు ఆర్యుల తీరేనే సవాలు చేస్తునాయి.

ఆర్యులు ఎక్కడినుంచో రాలేదు, ఆర్యలు భారతదేశం నుంచే ప్రపంచానికి విస్తరించారనే కోణం ఇప్పుడు ప్రకంపనలు రేపుతుంది.

నిజానికి మహాభారతం (Mahabharat) లోహ యుగంలో జరిగినది అంటారు. అంటే రాగి ని ఆ కాలంలో ఎక్కువగా వాడారు అన్నమాట, అందుకే దానిని కాపర్ టైమ్ అనుకోవచ్చు. అందుకే ఎక్కడ చూసిన రాగి లోహాన్ని అన్నీ రకాలుగా వాడే యుగంలో మహాభారతం కొనసాగింది.

ఆనాటి కాలం లోనే కాపర్ వల్ల మానవాళికి ఒరిగే లాభం గురుంచి ఆలోచించారని అనుకోవచ్చు. సినౌలీ అన్నది ఉత్తర ప్రదేశ్ లోని ఒక ప్రాంతం, మహా భారతం (Mahabharat) ఉత్తరాదిన జరిగిందన్న విషయాన్ని బలపరిచేలా అన్ని ఉదాహరణలు అక్కడే కనిపిస్తాయి.

mahabharat

అయిదు వేల సంవత్సరాలకు పూర్వమే ఒక జంతువును ఉపయోగించి నడిపించే పర్ఫెక్ట్ టెక్నాలజీ కూర్చబడిన రథం ను భారతీయులే ముందు తెలుసుకన్నారని తేలిపోయింది. ఎందుకంటే ఈ రథం నడిచిన సమయం లో ప్రపంచం లో మరెక్కడా నాగరికత ఇంకా మొదలు కాలేదు.

సినౌలీ లోని సైటు లో రెండు బరియల్స్ లో మూడు రథాలు బయట పడ్డాయి. వాటి సైజ్ ను బట్టి అవి గుర్రాలతో నడిచేవి గా ఋజువయ్యాయి. పైగా ఎక్కడ చూసిన రాగి లోహాన్ని తాపడంగా ఉపయోగించడం ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు.

రథాలు ఒక ప్రత్యేక ఉపయోగం కోసం తయారు చేసినట్లుగా ఇప్పుడు బయటపడిన అవశేషాలతో తేలిపోయింది. రథాల తయారీ వెనక వైదిక సూత్రాలు దాగి ఉన్నాయి. వేదాలలో రథ నిర్మాణంపై ఉన్న ప్రస్తావనకు ఇవి సరిపోతున్నాయి. ఆ విషయాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు, మేధావులే గుర్తించారు.

mahabharat

ఏ ఇంటిలో అయితే పాండవులను సజీవ దహనం చేయాలని దుర్యోధనుడు ప్రయత్నించాడో ఆ ఇల్లు ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, ఆ మైనం తో చేసిన గృహ పరిశోధనల కు ఇప్పుడు భారత పురావస్తు శాఖ ఆమోదం తెలిపింది. చాలా ఏళ్ల గా ఎంతో మంది పరిశోధకులు చరిత్రకారులు చేస్తున్న విజ్ఞప్తులను మన్నించి పాండవుల లక్క ఇల్లు గా భావిస్తున్న స్థలంలో త్రవ్వకాలకు ఆమోదం తెలిపింది. ​

ఇది కూడా చదవండి : ఫోను వద్దు-ఆట ముద్దు-ఆటాడుకుందాం రా