Pushyami Star : ఆగస్ట్ 8 న ఆకాశంలో మహాద్భుత యోగం జరగబోతోంది, అదే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం తో కూడుకున్నది.
అత్యంత అరుదుగా వచ్చే ఈ రోజు, 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది,మరి అలాగే ఎంతో మందికి ఇష్టమైన ఈ రోజు ఎలా ఉంటుంది, దాని యొక్క విశిష్టత ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అందులోనూ ఈసారి అత్యంత అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం (Pushyami Star) తో కూడి ఉన్నది. ఆదివారం అమావాస్య అనేది సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక మూడు లేదా నాలుగు సార్లు వస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఆదివారం పుష్యమి నక్షత్రం తో కలిసి వస్తుంది అది పుష్యర్క యోగం. అది కూడా రెండు మూడు సార్లు వస్తుంది సంవత్సరానికి.
అయితే 100 ఏళ్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా వచ్చేటటువంటిది ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం (Pushyami Star) ఈ మూడు కలిసిన రోజు చాలా ప్రాముఖ్యమైనది ఎంతో శుభదాయకమయిన రోజుగా మనం చెప్పుకోవచ్చు.
ఇటువంటి ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం (Pushyami Star) ఆగస్టు ఎనిమిదో తారీకు రోజున ఈ సంవత్సరం మనకు ఏర్పడబోతుంది.
మనం దీనిని ఆషాడ అమావాస్య అనుకుంటే ఉత్తరాది ప్రాంతం వారు హరియాలా అమావాస్య అనే పేరుతో దానిని పిలుచుకుంటారు. అయితే సహజంగా మనం ఎన్నో దేవతా పూజలు హోమాలు అభిషేకాలు ప్రతి రోజు చేయించుకుంటుటాము.
కొంత మంది ఉపాసనపరులు, తంత్రవేత్తలు అలాగే దేవతా సంబంధమయిన పూజలు బాగా చేసుకునే వారికి ఈ ఆషాడ అమావాస్య పుష్యమి నక్షత్రం (Pushyami Star) చాలా విశేషంగా చెప్పుకోవచ్చు.
మనకు ఉన్నటువంటి స్థితి ప్రకారం చూసుకుంటే మన యొక్క జ్ఞానం అంతా కూడా ఒక మనిషి నుంచి మనిషికి ట్రాన్స్ఫర్ కాలేదు అయితే ఇతర దేశాల్లో అయితే జ్ఞానం ను మళ్ళీ వేరే వాళ్ళు కూడా కొనసాగించేలా వాళ్ళు పొందుపరిచే వాళ్ళు, ప్రింట్ చేసేవారు .
మన దగ్గర మనిషి నుంచి మనిషి వరకు మాత్రమే వెళ్ళేది. మహాభారతంలో అర్జునుడు తన ధనుస్సుతో ఒకేసారి ఐదు బాణాలను ఒకేసారి సంధించగలిగే చాతుర్యత మరియు గొప్ప శక్తి ఉంది. ఏకలవ్యుడికి అర్జునుడి కంటే ఏడు సార్లు అనగా ఏడు బాణాలు సాధించగలిగే శక్తి ఉంది, అంటే ఈ విజ్ఞానం వారితోనే ఆగిపోయింది.
ఇప్పుడు ఒలింపిక్స్ లో అర్జున విభాగం లో మన వారికి తక్కువ ఫలితాలు వస్తుంటాయి. అనగా ఆ విజ్ఞానం మన తోనే ఆగిపోయింది. మనిషి నుంచి మనిషికి సరఫరా కాలేదు.
అతిరహస్యంగా ఉంచే కొన్ని యోగాలు ఉంటాయి అవి, జాతకరీత్యా కావచ్చు, సిద్ధాంత రీత్యా కావొచ్చు, పంచాంగ రీత్యా కావచ్చు కొన్ని గ్రహాల యొక్క కదలికలు మరియు అంతరిక్షంలో ఏర్పడబోయేటటువంటి కొన్ని అద్భుత యోగాలు తంత్ర మార్గంలో ఉపాసన పరులకు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి.
ఈ రోజు మళ్ళీ మళ్ళీ రాదు చాలా గొప్పది. ఈ సమయం మళ్ళీ మనం కావాలని వున్నా రాదు మరియు ఇది మరో వందేళ్ల తరువాత వస్తుంది.
పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కానీ పుష్యమీ నక్షత్రానికి దేవత ఎవరు అంటే బృహస్పతి, నవగ్రహాలలో ఒక గ్రహం దేవతల గురువు అందుకే పుష్యమి నక్షత్రం యొక్క 8 వాక్యాలలో బృహస్పతి నా మంతో ప్రారంభం అవుతుంది, నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు ఎవరయ్యా అంటే బృహస్పతి.
రవి ఈ యొక్క విశ్వానికి అంతా వెలుగుని ఇస్తే ఆ వెలుగును తీసుకున్నటువంటి గురుగ్రహం అంతా కంటే పది రెట్ల వెలుగును ఈ విశ్వానికి అందచేస్తాడు. అందుకనే రెండవ సూర్యుడిగా మనం భావిస్తుంటాం.
పుష్యమీ నక్షత్రం (Pushyami Star) అర్థం ఏమిటంటే పోషింప బడేది పోషించేది పుష్టిని కలిగించేది అనగా మనం ఆ యొక్క పుష్యమి నక్షత్రం లో ఏది చేసిన మనకు అనుకూలంగా మారుతుంది .
ఈ యొక్క పుష్యమి నక్షత్రం (Pushyami Star) లో ఏ పని మొదలు పెట్టినా తొందరగా అవుతుంది కారణం ఏంటంటే మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో క్షిప్రతారా లో అశ్వని, పుష్యమి, హస్త నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఏ పని చేసినా అత్యంత శీఘ్రంగా ఫలితాన్నిస్తాయి.
అందుకే మన దేవతలలో వినాయకుడు సంబంధించిన దేవతల చూసుకున్నట్లయితే క్షిప్ర గణపతి అంటారు అంటే అన్ని గణపతులు యోగాలనిస్తాయి. కానీ ఈ క్షిప్ర గణపతి ని ఎవరైతే ఆరాధిస్తారో చాలా తొందరగా వారి కోరికలు నెరవేరుతాయి.
మనకు వృక్ష దేవత ఆరాధన కూడా మన యొక్క హిందూ ధర్మంలో సాంప్రదాయమే అందుకనే రావి చెట్టు చుట్టూ అలాగే మర్రి చెత్తు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాం, అలాగే మామిడి చెట్టు దగ్గర కూడా తిరుగుతూ ఉంటాం, ఆది దంపతులు అయిన పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కోసం.
ఆ సమయంలో దేవతా శక్తులన్నీ భూమ్మీద సంచరిస్తూ ఉంటాయి ఎక్కడో అంతరిక్షం లో ఉన్నవి ప్రజలకు మేలు చేయాలనే సదుద్దేశం తో ఏ యొక్క ప్రకృతి లో ద్విగుణనీకృతమై ఉన్న దేవతా శక్తులు ఆరోజు భూమ్మీద సంచరిస్తూ ఉంటాయి.