Cheaper Countries : లక్ష రూపాయలతో కోటీశ్వరులు అయ్యే దేశాలు మీకు తెలుసా?

Dalitha Bandhu Huzurabad
Cheaper Countries :  మన దగ్గర లక్ష రూపాయలు ఉంటే అక్కడ కోటి రూపాయలతో సమానం, మనకు విలువనిచ్చే పర్యాటక దేశాలలో పర్యటించాలని చెపుతూ ఉంటారు పర్యాటక రంగ నిపుణులు.

మనం ఎప్పుడు వింటుంటాం రూపాయి విలువ దారుణంగా పడిపోయింది, పతనమైనది, ఇంత కనిష్టం ఎప్పుడు చూడలేదని ఆర్థిక రంగ నిపుణులు వాపోతుంటారు, భారత కరెన్సీ అమెరికా తో పోల్చుకొని చూడటం మనకు అలవాటు అయిపోయింది.

ఈ రోజు మన కరెన్సీ ని డాలర్ తో మార్చుకుంటే దాదాపుగా డెబ్బై నాలుగు రూపాయలు వస్తాయి. అంటే 1 డాలర్ విలువ మన దేశం లో 74 రూపాయలు అన్నమాట, మరి నాణేనికి అటు వైపుగా చూస్తే మన నాణేనికి కూడా కొన్ని దేశాలలో చాలా విలువ ఉంది.

కొన్ని దేశాలలో మన దగ్గర లక్ష రూపాయలు ఉంటే అక్కడ కోటి రూపాయలతో సమానం, మనం అమెరికా లాంటి సంపన్న దేశాలతో కాకుండా మనకు విలువనిచ్చే పర్యాటక (Cheaper Countries) దేశాలలో పర్యటించాలని చెపుతూ ఉంటారు పర్యాటక రంగ నిపుణులు.

నిజానికి మన రూపాయి అక్కడి వారికి గొప్ప, అయితే గత సంవత్సరం నుంచి ఇప్పటి దాకా కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక రంగం కుదేలైపోయింది.

Money

లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఆర్థికంగా నష్టపోయారు. ఈ నేపద్యంలో విదేశీ పర్యటన అనేది ఎవరికైన చాలా భయం కలిగిస్తుంది. కొన్ని దేశాలలో రూపాయికి విలువ ఉన్న కారణంగా అక్కడ పర్యటన చాలా తక్కువలో అయిపోతుంది. ఆయా దేశాలకు (Cheaper Countries)  వెళితే ఒక్కసారిగా ధనికులం అయ్యమని కూడా అనిపిస్తుంది.

కరోనా తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటే కొన్ని దేశాలు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. కాకపోతే దానికి ముందు ఆయా దేశాల (Cheaper Countries) నిబందనలు ఏమైనా ఉన్నాయా అన్నది ముందే చెక్ చేసుకోవాలి.

అయితే మన దేశ రూపాయిని గౌరవించే దేశాలేంటో అక్కడ కరెన్సీ మన కరెన్సీ విలువ ఎంత తక్కువ ఉన్నదో వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. ఇరాన్ (Iran)

 Cheaper Countries

మన దేశ రూపాయిని గౌరవించే దేశాలలో మొదటగా చెప్పుకునే దేశం (Cheaper Countries) ఇరాన్. ఈ దేశం అత్యంత పురాతనమైన, భౌగోళిక ప్రాంతం.

అక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అక్కడ ఒక్క రూపాయి 569.43 ఇరానియన్ రియాల్స్ కి సమానం. అక్కడికి మనం ఒక లక్ష భారత కరెన్సీ తో వెళితే మన జేబులో 5.6 కోట్ల ఇరానియన్ రియాల్స్ ఉన్నట్టే. అక్కడ ఆ డబ్బుతో మనం మహారాజుల గడపవచ్చు. ఇరాన్ ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతం.

మిగతా దేశాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. దేశం లో మరెన్నో టూరిస్ట్ ప్లేస్ లు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి. మహిళలు ఇక్కడ తలను కప్పుకోవడం లాంటి రూల్స్ తప్పక పాటించాల్సి ఉంటుంది. అద్భుతమైన ఇరానీ చాయ్ నాన్ వెజ్ ప్రియులను దోచుకుంటాయి.

2. వియత్నాం (Vietnam)

 Cheaper Countries

మన దేశపు తక్కువ కరెన్సీ విలువ ఉన్న మరొక దేశం (Cheaper Countries) వియత్నాం. అద్భుతమయిన ప్రకృతి రమణీయత ఈ దేశం ప్రత్యేకత. ఇక్కడ మన రూపాయి 310.46 వియత్నామీస్ డాంగ్ లతో సమానం. అంటే ఒక లక్ష రూపాయలు అక్కడ దాదాపు మూడు కోట్ల వియత్నామీస్ డాంగ్ లతో సమానం .

ఈ డబ్బుతో వియత్నాం లో పర్యటన నల్లేరు మీద నడకలా, ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది. అక్కడి వారికి మీరు కోటీశ్వరులు. మీరు అలా దర్జాగా వియత్నాం వీధులలో నడుచుకుంటూ వెళుతుంటే చాలా మంచి అనుభూతి వస్తుంది.

3. ఇండోనేషియా (Indonesia)

 Cheaper Countries

మన దేశపు తక్కువ కరెన్సీ విలువ ఉన్న మరొక దేశం (Cheaper Countries) ఇండోనేషియా. సుందరమయిన సముద్ర తీరాలు, అంత్యంత ప్రాచీనమయిన దేవాలయాలు ఈ దేశం ప్రత్యేకత. ముఖ్యంగా అక్కడి బాలి ద్వీపానికి చాలా మంది భారతీయులు వెళ్తుంటారు.

బాలి ద్వీపం పర్యాటక కేంద్రంగా, పుణ్య స్థలంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 90 % హిందువులు నివసించే ఈ ప్రాంతం లో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కేవలం రెండు సీజనులు మాత్రమే ఉంటాయి. అవి చలి కాలం, వర్షా కాలం అంతే. వేసవి కాలం ఉండదు.

దీనితొ చాలా మంది వేసవి తో ఇబ్బంది పడే దేశాల నుంచి ఇక్కడికి వస్తారు. బాలి ని దేవతల నివాసంగా పిలుస్తారు. ఈ దీవి ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ మన ఒక్క రూపాయి 195.09 ఇండొనేషియన్ రూపాయలతో సమానం. అంటే ఒక్క లక్ష రూపాయలతో మనం అక్కడికి వెళితే మన వెంట 2 కోట్ల రూపాయలను తీసుకెళ్లినట్లే.

4. కెన్యా (Kenya)

 Cheaper Countries

మరొక దేశం పేరు కొన్యా. ముఖ్యంగా సాహస యాత్రికులకు అది స్వర్గ దామం . కోస్టల్ కంట్రీ గా పేరున్న రిపబ్లిక్ ఆఫ్ కొన్యా జనాభా 12.4 మిలియన్లు. 80% ముస్లింలు ఉండే ఈ దేశం లో ఉర్దూ తో పాటు 24 ఇతర భాషలు వినియోగం లో ఉన్నాయి. ఒక లక్ష రూపాయలతో అక్కడికి వెళితే మీ దగ్గర 1.3 కోట్ల కొనియన్ ఫ్రాంకులు ఉన్నట్టే.

5. పేరాగ్వే (Paraguay)

Cheaper Countries

బ్రెజిల్, అర్జెంటీనా లో మధ్యలో ఒక చిన్న దేశం పేరు పేరాగ్వే. ఇది కూడా యాత్రికులకు పెట్టింది పేరు. పేరాగ్వే కి ఆ పేరు దేశం లో ప్రవహిస్తున్న పేరాగ్వే నది కారణంగా వచ్చింది, అక్కడ మన లక్ష రూపాయలు 90 లక్షల పెరాగ్వెనియన్ గౌరనిలతో సమానం. మన దేశ రూపాయి కి విలువనిచ్చే దేశాలలో (Cheaper Countries) పేరాగ్వే కూడా ఒకటి.

ఇది కూడా చదవండి : మహాభారతం ఆధారాలు ఉత్తర భారతదేశం లో