Moon vs Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు

Moon
Moon Stars Story : పొగరుబోతు చందమామ మరియు మెరిసే నక్షత్రాలు

అనగనగా ఒక చందమామ ఉండేవాడు. లోకంలో ఉన్న వెలుగంతా తన దగ్గరే ఉంది అని అనుకొని దాని గురించి ఎంతో గర్వ పడే వాడు. ఒక రోజు భూమి చందమామ దగ్గరికి వస్తుంది, చందమామ ఒక మెరుస్తున్న వస్తువుని అలా చుస్తూ ఉన్నాడు, అంతగా అటు వైపు ఏం చూస్తున్నావు అని భూమి చందమామని అడుగుతుంది.

అప్పుడు చందమామ ఏదో మెరుస్తూ ఉంది అని అంటాడు. దానికి భూమి అవి నక్షత్రాలు (Stars), అవి మెరుస్తూ ఉంటాయి అని చెబుతుంది. అప్పుడు చందమామ కోపం కలిసిన గర్వం తో అవి నాకంటే ఎక్కువ వెలుగును ఇవ్వగలవా ? అని అంటాడు. అప్పుడు భూమి అవి నీకంటే ఎక్కువ వెలుగును ఇస్తాయి అది సాద్యమే అని అంటుంది.

Stars

దానికి చందమామ కోపం తో రాత్రి సమయం లో మి అందరికి నా వల్లే వెలుగు వస్తుంది ,ఈ భూమ్మీద ప్రజలు నేనిచ్చే వెలుగు తోనే రాత్రి సమయం గడుపుతారు అని భూమితో అంటుంది.

అప్పుడు భూమి నువ్వు నా మాటలు నమ్మట్లేదు కదూ, నువ్వే నేరుగా వాటి దగ్గరికి వెళ్ళి తెలుసుకో అంటుంది, అప్పుడు భూమి అవి చాలా దూరం లో ఉంటాయి, నువ్వు అక్కడికి వెళ్ళలేవు అని అంటుంది.

ఈ ప్రపంచం లో వెలుగును ఇచ్చేది ఆ పిచ్చి నక్షత్రాలు (Stars) కాదు ఎప్పటికి నేనే అని నిరూపిస్తాను అంటు చందమామ నక్షత్రాలు ఉండే చోటుకి బయలు దేరుతాడు. ఎంత దూరం ప్రయాణించినా, ఎంత వేగంగా వెళ్ళినా ఆ నక్షత్రాల (Stars) దగ్గరకు చేరుకోలేక పోతాడు.

తన దారిలో ఎన్నో గ్రహాలను కలిసాడు. అవి అన్ని ఎక్కడికి అంతా వేగంగా వెళుతున్నావు అని అడుగుతాయి. వాటికి కూడా తను ఎందుకు అక్కడికి వెళుతున్నాడో చెబుతాడు, చందమామ చెప్పింది విని మిగిలిన గ్రహాలు వాటిలో అవే నవ్వుకుంటాయి.

Stars

దానితో చందమామ కోపం తో మళ్ళి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కొద్ది సేపట్లో ఎంతో వేడిగా ఉన్న, ఎంతో ప్రకాశవంతంగా ఉన్న సూర్యుడి దగ్గరికి చేరుకుంటాడు, సూర్యుడికి కూడా తను ఎందుకు వెళుతున్నాడో చెబుతాడు.

దానికి సూర్యుడు నువ్వు నా నుండే వెలుగును తీసుకుంటావు , నీ దగ్గర సొంతంగా వెలుగు లేదు చందమామ అని అంటాడు. కాని నక్షత్రాలు (Stars) వాటిలో ఉండే వెలుగు తోనే మెరుస్తాయి, అవి నువ్వనుకున్న దాని కంటే పెద్దగా కూడా ఉంటాయి అని సూర్యుడు అంటాడు.

దానికి కూడా చందమామ ఒప్పుకోకుండా మళ్ళి తన ప్రయాణాన్ని నక్షత్రాల (Stars) దగ్గరికి మొదలు పెడతాడు. కొద్ది దూరం లో చందమామకి నక్షత్రాలు కనిపిస్తాయి.

చందమామ చివరికి ఎన్నో మిలియన్‌ల కిలో మీటర్‌లు పయనం చేసి నక్షత్రాల దగ్గరకి చేరుకుంటున్న చందమామ వొంటి నిండా చెమటలతో నిండిపోతాడు. అలా నీరసంగా నక్షత్రాల దగ్గరకి చేరుకుంటాడు. తను చూసిన దృశ్యాన్ని నమ్మలేక పోతాడు. పైకి చూస్తే అక్కడ ఒక నక్షత్రం ఉంటుంది, అది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది.

Stars

అప్పుడు చందమామ ఆశ్చర్యం తో  “దేవుడా నువ్వు ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తున్నావు, నేను నమ్మలేక పోతున్నాను, దూరం నుంచి అంత చిన్నగా కనిపిస్తూ దగ్గరికి వచ్చి చూస్తే ఇంత పెద్దగా ఉన్నావే అని?” నక్షత్రం తో అంటుంది.

అప్పుడు నక్షత్రం ఇలా నవ్వుతూ చెబుతుంది …నేను నక్షత్రం జాతికి చెందిన దానిని, మేము వేరు, వేరు పరిమాణాలలో వచ్చి సూర్యుడు ఎక్కడ ఉన్నాడో బట్టి వేరు వేరు ప్రదేశాలలో ఉంటాము అని చెబుతుంది.

దానికి చందమామ ఆశ్చర్యం తో “మీరందరూ ఈ అంతరిక్షంలో ఒక అందమయిన సృష్టి , నువ్వు ఇంత ప్రకాశవంతంగా ఉన్నావు.నాకన్న ప్రకాశవంతంగా ఒకటి ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదు అని అంటుంది”.

దానికి నక్షత్రం ఒక్కొక్కరం ఒక్కో పరిమాణం లో మెరుస్తూ ఉంటాము నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు చందమామ అని అని అంటుంది. చందమామ నక్షత్రానికి ధన్యవాదాలు చెప్పి తను ఉండే చోటుకి బయలు దేరుతుంది, అలా తను వెనక్కి వెళ్ళే దారిలో మళ్ళి గ్రహాలను కలిసి నక్షత్రం (Stars) గొప్పతనాన్ని చెబుతుంది.

Stars

అది గ్రహాలతో నేను నక్షత్రాలను అంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండడం చూసి నేనొక్కడినే గొప్ప వాడిని కాను అని తెలుసుకున్నాను, ఈ లోకం లో నా చుట్టూ గొప్పవి ఇంకా చాలానే ఉన్నాయి అని అంటాడు.

నిజమేంటో తెలుసుకున్న చందమామ తిరిగి భూమి దగ్గరికి వస్తాడు, అప్పటికే చందమామ అలసిపోయి ఉంటాడు. కాని అరోజు ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. అప్పుడు భూమి చందమామ తో మిత్రమా  ” నీ ప్రశ్నలన్నింటికి జవాబు దొరికింది అని అనుకుంటున్నాను , ఎప్పుడూ సౌమ్యంగా ఉండు , ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారి కంటే నువ్వే గొప్ప అని ఎప్పుడు అనుకోకు అని అంటుంది.”

నీతి : ఎప్పుడూ సౌమ్యంగా ఉండాలి , ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారి కంటే నువ్వే గొప్ప అని ఎప్పుడు అనుకోవద్దు.

ఇది కూడా చదవండి : తొలి రేడియో స్టేషన్ – భారత్