జాతీయం-అంతర్జాతీయంలైఫ్ స్టైల్

Radio 1927: ఆల్ ఇండియా తొలి రేడియో స్టేషన్ – భారత్

Radio
Radio Station India : ఇక రేడియో ద్వారా వార్తలు, కార్యక్రమాల ప్రసారం చేయడం భారతదేశం లో జులై 23,1927 లో ప్రారంభం అయింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ బొంబాయ్ లో తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు.

ఇప్పుడు వినోదానికి బోలెడు దారులు. సమాచారానికి ఇబ్బంది లేని పరిస్థితి. క్షణాల్లో కాదు కాదు లిప్తి పాటులో ప్రపంచం లో ఏ మూలన ఏది జరిగిన మన ముందుకు ప్రత్యక్షమయి పోతుంది. అయితే ఈ సమాచారం తొలినాళ్ళలో ప్రపంచం లో రేడియో ద్వారా ప్రసారమయ్యేది, సమాచారం అనేది వేగవంతంగా చేరవేయడానికి రేడియో (Radio) తరంగాల ఆవిష్కరణ పెద్ద మలుపు.

Radio

ఇక రేడియో (Radio) ద్వారా వార్తలు, కార్యక్రమాల ప్రసారం చేయడం భారతదేశం లో జులై 23,1927 లో ప్రారంభం అయింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ బొంబాయ్ లో తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రేడియో కేంద్రాన్ని 1930 లో జాతీయం చేసారు.దీనికి ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ గా పేరు పెట్టారు.

అనంతరం 1936 లో ఇండియన్ స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియో గా మార్చారు. అదే సంవత్సరం లో మొదటి న్యూస్ బులిటెన్ ఆల్ ఇండియా ద్వారా ప్రసారం చేసారు. మొదటి ప్రపంచ యుద్దం లో రేడియో తరంగాలను విసృతంగా ఉపయోగించారు. ఆ తరువాత ప్రైవేటు రేడియో (Radio) స్టేషన్ లు ప్రపంచంలో ప్రారంభం అయ్యాయ్.

బిబిసి ఇంగ్లాండ్ లో ప్రారంభం అయింది. స్వాతంత్ర సమయంలో భారతదేశం లో తొమ్మిది రేడియో స్టేషన్ లు ఉండేవి. కాని పాకిస్థాన్ విడిపోయినప్పుడు అందులో మూడు రేడియో స్టేషన్లు పాకిస్థానులోకి వెళ్ళిపోయాయి. మన దేశం లో ఢిల్లీ, బొంబాయి, కోల్‌కత్తా, మద్రాస్, తిరుచ్చిరాపల్లి, లక్నో ల్లో రేడియో (Radio) స్టేషన్ లు ఉన్నాయి.

Radio

అప్పుడు జనాభాలో పదకొండు శాతానికి మాత్రమే ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు ఉన్నాయి. ఆల్ ఇండియా పేరు ను ఆకాశవాణిగా, భారత రేడియో గా 1956 లో మార్చారు. ఆ తరవాత సంవత్సరం లో వివిధ భారతి ప్రారంభించారు.

ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో ద్వారా 100 కి పైగా ప్రపంచ దేశాలలో 11 భారతీయ, 16 విదేశీ భాషలలో ప్రతిరోజూ 56 గంటల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ప్రపంచం లో మీడియా సంస్థగా చెప్పుకుంటున్నారు. భారతదేశ జనాభా లో 99.1 శాతం ఆల్ ఇండియా అందుబాటులో ఉంది.

Radio

ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలు 262 ప్రసార కేంద్రాల ద్వారా భారతదేశఒ లోని 91% ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో రేడియో ప్రారంభం గురుంచి చెప్పుకుంటే అది 1900 సంవత్సరంలో ప్రారంభం అయిందని చెప్పుకోవాలి.

24 డిసెంబర్ 1906 న కెనడియన్ శాస్త్రవేత్తలు రెసినాల్డ్ ప్రసండన్ రేడియో స్టేషన్ లో వయోలిన్ వాయించారు. సూదుర సముద్రంలో తెలియాడుతున్న ఓడలో అతని వయోలిన్ శబ్దం వినిపించింది. అలా ప్రపంచంలో తొలి రేడియో ప్రసారం ప్రారంభం అయినది.

ఇది కూడా చదవండి : “తేజస్” యుద్ధ విమాన తయారి ఇక్కడే – హైదరాబాద్