Rashmika Ramcharan: మెగా ఫ్యాన్స్ అంతా రాం చరణ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్‌లలో చూద్దామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామారాజు గా నటిస్తున్నారు రాం చరణ్.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చేసింది.
ఇక ఈ సినిమా తో పాటు మెగాస్టార్ నటిస్తున్నా ఆచార్య మూవీలో రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.కొరటాల శివ దర్శకత్వం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధ అనే విద్యార్థి నాయకత్వ పాత్రలో రాం చరణ్ కనిపించనున్నారు.
వీటితో పాటు టాప్ డైరెక్టర్ శంకర్ లో ఓ సినిమా చేస్తున్నారు.అయితే ఇప్పడికే ప్రిప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసినా ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా కోసం హీరోయిన్ కూడా ఫిక్స్ చేసారనే టాక్ వినిపిస్తోంది.
చరణ్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ రష్మిక (Rashmika) మందన ను ఫిక్స్ చేసారట.
ఇప్పడికే టాలీవుడ్ యమ క్రేజు తెచ్చుకున్న ఈ బ్యూటి ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారట శంకర్ అండ్ టీం, అందులో భాగంగానే రష్మిక (Rashmika) మందన ను ఈ ప్రాజెక్టులో కి తీసుకొచ్చారట.
శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ పైగా మెగా పవర్‌స్టార్ సరసన సరసన ఇలాంటి చాన్సును ఎవరైయినా వదులుకుంటారా ,దానితో రష్మిక కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇండస్ట్రీలో టాక్.
ప్రస్తుతం రష్మిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సుకుమార్ దర్శకతవం లో అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
అలాగే బాలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోతున్నారు.