Gmail Shortcuts : జిమెయిల్ లో మనకు ఎక్కువగా అవసరం అయ్యే కొన్ని ట్రిక్స్ మరియు షార్ట్‌కట్స్.
జిమెయిల్ అకౌంట్ ద్వారా మన మెయిల్స్ ని చెక్ చేసుకునేటప్పుడు, ఎవరికైన మనం మెయిల్స్ ని పంపించేటప్పుడు మనకు ఎక్కువగా అవసరం అయ్యే కొన్ని ట్రిక్స్ మరియు షార్ట్‌కట్స్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
మనం సాధారణంగా ఎవరికయినా మెయిల్ చేయాలంటే కంపోస్ అనే ఆప్షన్ కి వెళతాం, దీనికి డైరెక్ట్ షార్ట్‌కట్ వచ్చేసి “సి” Gmail Shortcut (C) అనే బట్టన్ ను ప్రెస్ చేస్తే కంపోస్ అనే బాక్స్ ఒపెన్ అవుతుంది, ఒకసారి ఈ బాక్స్ ఒపెన్ అయిన తరువాత అందులో మనం ఎవరికి మెయిల్ చేస్తున్నామో వారి డిటెల్స్ ఇచ్చి సెండ్ అనే బట్టన్ ని ప్రెస్ చేస్తాం, అయితే ఈ సెండ్ అనే దానికి షార్ట్‌కట్ వచ్చేసి Ctrl+Enter .
పర్టికురల్ మెయిల్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో యాష్ (#) సింబల్ ప్రెస్ చేస్తే ఆ మెయిల్ అనేది డిలీట్ అవుతుంది.
అలాగే మనం పంపించిన మెయిల్స్ అన్ని సెంట్ అనే కేటగిరీలో ఉంటాయి. దీనికి డైరెక్ట్ షార్ట్‌కట్ వచ్చేసి (G,T) ప్రెస్ చేయాలి.
అలాగే (G,I) ప్రెస్ చేస్తే డిరెక్ట్ ఇన్‌బాక్స్ ఒపెన్ అవుతుంది. అలాగే మన ఈ-మెయిల్ లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అవి మొత్తం ఒక లిస్ట్ లాగా రావాలంటే Gmail Shortcuts (G,C) ప్రెస్స్ చేయాలి. అప్పుడు సపరేట్ ట్యాబ్లో మీ జీమెయిల్ లో టోటల్ కాంటాక్ట్స్ అన్ని డిస్‌ప్లే అవుతాయి.
ఎవరి మెయిల్ కి అయిన రిప్లై ఇవ్వాలి అనుకుంటే ‘R’ ప్రెస్స్ చెస్తే డైరెక్ట్‌గా వారికి రిప్లై వెళ్ళిపోతుంది.
మెయిల్ లో ఉన్న డాటా ఫార్వర్డ్ చేయడానికి ‘F’ ప్రెస్స్ చేస్తే వారికి ఫార్వర్డ్ అవుతుంది, అయితే జిమెయిల్ లో షార్ట్‌కట్స్ Gmail Shortcuts అనేవి డైరెక్ట్ గా వర్క్ అవవు, దానికి మనం సెట్టింగ్స్ లో షార్ట్కట్స్ “ఆన్” లో ఉండేలా చూసుకోవాలి.
జిమెయిల్ లో ఇంటర్‌ఫేస్ రెండు వరుసలుగా రావడానికి వర్టికల్ స్ప్లిట్ అనే బట్టన్ ను ప్రెస్ చేయాలి , ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవడానికి సెట్టింగ్స్ లో ఇన్‌బాక్స్ అనే కేటగిరీలోకి వెళితే రీడీంగ్ పాన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి.
కాంటాక్ట్స్ లో లేబుల్ అనే అప్షన్ ఉంటుంది అక్కడ క్రియేట్ లేబుల్ అనే దగ్గర మనకు కావాల్సిన పేరు ఇచ్చుకోని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొవచ్చు, గ్రూప్ మెయిల్స్ పంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి : ఎస్‌బీఐ ఆరోగ్య సుప్రీం బీమా పాలసీ బీమా కవరేజ్ 5కోట్లు
.