జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

SBI Insurance: ఎస్‌బీఐ ఆరోగ్య సుప్రీం బీమా పాలసీ బీమా కవరేజ్ 5కోట్లు

SBI Insurance
SBI Insurance : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్‌ల కోసం సరికొత్త స్కీముల ను ప్రవేశపెడుతోంది. ఎస్‌బీఐ బ్యాంకింగ్ సెక్టర్‌లోనే కాకుండా ఇన్సూరెన్స్ రంగం లోనూ చెలరేగిపోతోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్‌ల కోసం సరికొత్త స్కీముల ను ప్రవేశపెడుతోంది. ఎస్‌బీఐ బ్యాంకింగ్ సెక్టర్‌లోనే కాకుండా ఇన్సూరెన్స్ రంగం లోనూ చెలరేగిపోతోంది. కొత్త కొత్త ఇన్సూరెన్స్ స్కీములను అందుబాతులోకి తీసుకువస్తూ ఆయా బ్యాంకులకు పోటీగా దూసుకుపోతోంది.

అయితే ఇందులో భాగంగా తాజాగా ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ (SBI Insurance) , ఆరోగ్య సుప్రీం పేరుతో కొత్త ఆరోగ్య బీమా స్కీమును ప్రవేశపెట్టింది. ఇరువై(20) బేసిక్ కవరేజీలు, ఎనిమిది (8) ఆప్షనల్ కవరేజీలతో తో పాటు పూర్తి ఆరోగ్య బీమా కవరేజీను తన కస్టమర్లకు అందించేలా ఈ స్కీమును రూపొందించింది..

ఈ స్కీము కింద రూ.అయిదు(5)కోట్ల వరకు బీమా ఆప్షన్లను అందిస్తుంది. కస్టమర్ అవసరాలు, కవరేజీ ఫీచర్ల ఆధారంగా ప్రో, ప్లస్, ప్రీమియం అనే మూడు(3) ఆప్షన్లలో ఏదైన ఒక దాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఎస్‌బీఐ కల్పిస్తుంది.

సమ్ ఇన్సూర్డ్ రీఫిల్, రికవరీ బెనిఫిట్ వంటి కస్టమర్ ఫ్రెండ్లి ఒప్పందాల్లో భాగంగా ఒకటి(1) నుంచి మూడు(3) ఏళ్ళ వరకు స్కీము వ్యవధిని ఎన్నుకునే సదుపాయం కల్పిస్తుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు తమ అవసరాలకు అణుగుణంగా వారికి అనువయిన స్కీమును ఎన్నుకోవచ్చు.

ఆరోగ్య సుప్రీమ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు:

తాజాగా కరోనా కారణంగా ఇన్సూరెన్స్ (SBI Insurance) పాలసీలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కువ సంఖ్యలో అందరూ ఆరోగ్య బీమా పాలసీలు చేసుకుంటున్నారు.

గతంలో ఈ పాలసీల గురించి పెద్ద పట్టించుకుపోయినా ఈ కరోనా తరువాత ఈ పాలసీ ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఆయా రకాల ఇన్సూరేన్సు పాలసీ లను అందిస్తుంది.

SBI Insurance

దీనితో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రీమియం ధరలను బాగా పెంచేసాయి పాలసీ సంస్థలు, దీనివల్ల టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి..

ఈ క్రమంలో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ & సిఈఓ అయిన పిసి కాండ్పాల్ ఇలా మాట్లాడుతూ “ఇటివలి కాలంలో ఆరోగ్య బీమాకు ప్రాముఖ్యత పెరిగింది, కరోనా మహమ్మారి వల్ల అందరికి బీమా యొక్క అవసరం ఎంటో తెలిసివచ్చింది. దీని వల్ల అనేక మంది పాలసీలు చేసుకుంటున్నారు.

దీని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సుప్రీం, సమగ్ర ఆరోగ్య బీమా స్కీములను ప్రారంభించాం, కస్టమర్లు వారి అవసరాలకు తగ్గట్లు ప్రీమియం, పదవీకాలం ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నం అని ఆయన అన్నారు”.

మహమ్మారి వల్ల తెలిసొచ్చిన పాలసీల ప్రాధాన్యత:

అయితే కరోనా కారణంగా అందరికి ఆరోగ్య బీమా (SBI Insurance) తో భద్రత విలువేంటొ తెలిసి వచ్చింది. దీనితో ఈ కొత్త పాలసీని అమలులోకి తెచ్చినట్లు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది.

ఈ ఆరోగ్య సుప్రీం హెల్త్ పాలసీ లో అనేక రీఫిల్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ పాలసీ వల్ల రిటైల్ వినియోగదారులకు చాలా ప్రయోజనాలు, కవరేజీలను అందిస్తుందని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది.

ఇది కూడా చదవండి : ఎవరు గొప్ప రెండు వేల రూపాయల నోటు మరియు రూపాయి నాణెం