Telugu Movie Stars and Hindi Movie Stars and Their Business:
సినీ తారలంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు సినీమాల్లో సక్సెస్ అయిన తరువాత వారి సంపాదన కూడా అలాగే ఉంటుంది, భారీ స్థాయి లో అర్జిస్తుంటారు, కాని అదే స్థాయిలో వారి ఖర్చులు కూడా ఉంటాయి, లగ్జరీ కారు, హొటేల్స్, ఇల్లు, పని వారు ఇలా చెప్పుకుంటూ పోతే నెలవారి ఖర్చు లక్షల్లోనే ఉంటుంది, కొందరికైతే కోట్లలో ఖర్చు ఉంటుంది. అందుకే చాల మంది సినీ తారలు ఓ వెలుగు వెలిగి రెండు చేతులా సంపాదించి తరువాత అంతా పూర్తిగా కరిగిపోయి బతకడం కష్టంగా మారె అంత దయనీయమయిన స్థితికి వస్తుంటారు, ఎక్కువగా గత తరం తారల లో ఈ పరిస్థితి కనిపించేది.
ఈ తరం తారలు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పద్దతిని బాగా అనుసరిస్తున్నారు.
గత తరం మాదిరిగా తాము కాకూడదని స్టార్లు గా వెలిగినపుడు ఎలా లగ్జరీ జీవితం గడిపామో అలాగే తాము తమ కుటుంబాలు ఉండాలంటే ఏం చేయాలో నేటి హిరో లు, హీరోయిన్ లకు బాగా తెలుసు, అందుకే ఎవరికి నచ్చిన లాభాలు ఎక్కువగా ఉన్న వ్యాపార రంగాలను ఎంచుకొని విజయవంతమయిన వ్యాపారవేత్తలుగా చాలా మంది రాణిస్తున్నారు.
మన తారలు వారి వ్యాపారాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం .
1) మెగాస్టార్ చిరంజీవి (Telugu Movie Hero) :
టాలీవుడ్ లో మెగాస్టార్ గా పిలువబడే చిరంజీవి కి చాలా వ్యాపారాలు ఉన్నాయి. సొంత సినీ నిర్మాణ సంస్థ కుడా ఉన్నది. తన తోటి నటుడు నాగార్జున, క్రికెటర్ సచిన్ తెండూల్కర్, నిర్మాత అల్లు అరవింద్ ,వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి క్రీడారంగ ఫ్రాంచైసీ ల వ్యాపార రంగాల్లో ఉన్నారు, ప్రస్తుతం కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ జట్టు ను కుడా చిరంజీవి కొనుగోలు చేసారు, దానికి యజమానిగా ఉన్నారు.
2) కాజల్ అగర్వాల్ (Telugu Movie Heroine) :
కాజల్ అగర్వాల్ జ్యువెల్లరీ వ్యాపారం మొదలు పెట్టింది. చెల్లెలు నిషా అగర్వాల్ తో కలిసి మార్సల (మర్సల) జ్యువెల్లర్స్ తో సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అక్క చెల్లెల్లు ఇద్దరు కలిసి వారు వాడిన తమ నగలను కూడా ఆన్‌లైన్ లో అమ్మేస్తున్నారు, అలాగే తోటి నటీ నటులకు కూడా ఆభరణాలు విక్రయిస్తున్నారు.
అప్పుడప్పుడు హైదరాబాద్, ముంబై లలో జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ లు ఏర్పాటుచేస్తున్నారు. సోనాక్షి సిన్హా నుండి రాశి ఖన్నా వరకు స్టార్లు అందరు తమ కస్టమర్లే అంటూ కాజల్ సంబరపడుతుంది, కాజల్ అగర్వాల్ గతం లో ఒక వెబ్‌సైట్ ప్రారంభించింది, ఒకే రకమైన రంగం లో ఉండేవాల్లు ఒకే ప్లాట్‌ఫాం మీద కలుసుకునే వీలు ఆ వెబ్‌సైట్ ద్వారా కల్పించింది. ఆ వెబ్‌సైట్ ద్వారా వారు వారి ఉత్పత్తులను విక్రయించేందుకు సైతం కాజల్ ప్రోత్సహించింది.
3) మహేష్ బాబు (Telugu Movie Hero) :
బిజినెస్‌మ్యాన్ మహేష్ బాబు మంచి వ్యాపార వేత్త, ఆయనకి సినీ నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. దీనితో పాటు ఎఎంబి (AMB) సినీమాస్(ఏషియన్ మహేష్ బాబు సినీమాస్) అనే పేరు తో మల్టీప్లెక్స్ వ్యాపారం కూడా ఉంది. ఏషియన్ గ్రూప్ తో ఒప్పందం చేసుకోని దీనిని ప్రారంభించారు. హైదరాబాద్ లో ఉన్న అత్యాధునికమైన థియేటర్లలో మహేష్ బాబు ది కూడా ఒకటి.
4) రకుల్ ప్రీత్ సింగ్ (Telugu Movie Heroine) :
రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ ఫ్రాన్‌చైసీల్లో పెట్టుబడులు పెడుతోంది, ఫంక్షనల్ ఫార్టిఫై ట్రైనింగ్ పేరుతో ఈమె ఇప్పటికే హైదరాబాద్ గచ్చిబౌలి లో ఒక అత్యాధునిక జిమ్ ను ఏర్పాటు చేసింది, ఆ జిమ్ లో ఫిల్మ్ స్టార్లు, సాఫ్ట్‌వేర్ పీపుల్ రాజకీయనాయకులు మెంబర్లుగా ఉన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ విశాఖ, బెంగళూరు లోను ఫ్రాంచైసీ లను ఏర్పాటు చేసింది, భవిష్యత్తు లో మరిన్ని తన సొంత జిమ్ లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఆమె ఉంది.
5) అక్కినేని నాగార్జున (Telugu Movie Hero) :
టాలీవుడ్ లో అత్యంత విజయవంతమయిన వ్యాపారవేత్తగా అక్కినేని నాగార్జున కు పేరు ఉంది, ఆయనకు ఎన్ గ్రిల్స్ (N Grill) పేరుతో రెస్టారెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో హై ఫై కార్యక్రమాలకు వేదిక గా నిలిచే ఎన్ కన్వెన్షన్(N convention) కూడ ఆయనదే, ఆయన కేరళ బ్లాస్టర్ జట్టు కు సహ యజమా, గతం లో ఆయనకి మా టివిలో వాటాలు ఉండేవి.
6) సమంత (Telugu Movie Heroine) :
సమంత పెళ్ళికి ముందే ఎస్ వి ఎస్ పార్ట్నర్స్ ఎల్ ఎల్ పి (SVS Partners LLP) పేరు తో ఒక సంస్థను ప్రారంభించింది, ఈ కంపెనీ మొత్తం టర్నోవర్ కోటి ఎనభై లక్షల రూపాయలు, వంశీ మోహన్ గొట్టిముక్కల, మేఘన, శ్రీరాం కవికొండల సమంత తో పార్ట్‌నర్స్.
2017 ఫిబ్రవరి 15న హైదరాబాద్ యూసుఫ్‌గూడ కమలాపురి కాలనీ ఫేస్ 2 అడ్రస్ తో ఈ కంపెనీ ఏర్పాటు చేసారు.
7) రామ్ చరణ్ తేజ్ (Telugu Movie Hero) :
మగధీరుడు రామ్ చరణ్ తేజ్ విజయవంతమయిన వ్యాపారవేత్త కూడా, ఆయన ట్రూ జెట్ ట్రూ జెత్) వైమానిక రంగం లోకి అడుగుపెట్టారు, అంతే కాదు ఆయనకి పోలో క్లబ్ కుడా ఉంది, ఆయన సతీమని ఉపాసన అపోలో గ్రూప్ లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
8) తాప్సీ (Telugu Movie Heroine) :
తాప్సీ చిన్నపటి నుంచి పెళ్ళి వేడుకలు, ఫంక్షన్లు అంటే చాలా ఇష్టం. చుట్టాలు,స్నేహితులు ఎవరి ఇంట్లో ఫంక్షన్లు అయిన తాప్సీ వెళ్ళి అలంకరించి సంబ రపడేది, అందుకే హీరోయిన్ అయి డబ్బులు సంపాదించి తనకిష్టమైన రంగం లోనే వ్యాపారం ప్రారంభించింది. చెల్లెలు షగున్ పన్ను స్నేహితుడు ఫరా పరమేష్ సహకారం తో సొంతంగా ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ వెడ్డింగ్ కంపెనీ ప్రారంభించి లాభాలను గడిస్తుంది .
9) మోహన్ బాబు (Telugu Movie Hero) :
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ప్రొడక్షన్ హౌస్ తో పాటు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంకా శ్రీ విద్యా ఎడుకేషనల్ ట్రస్ట్ కూడా ఉంది. మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హైదరాబాద్ లో సొంతంగా విద్యా సంస్థలు నెలకొల్పాడు. వీరికి యానిమేషన్ స్టూడియో కూడా ఉంది. మోహన్ బాబు అతని ఇద్దరి కుమారులకు వేరు వేరు గా సినీ నిర్మాణ సంస్థలు ఉన్నాయి.
10) జగపతి బాబు (Telugu Movie Hero) :
జగపతి బాబు రాకముందు నుంచి అనేక వ్యాపారాలు చేసారు. కాని తనకి వ్యాపారాలు ఎప్పుడు కలిసి రాలేదని ఆయన చెబుతుంటారు. ఈయన సినీ కెరీర్ పీక్స్ కి వెళ్ళి దాదాపు ముగిసిపొయి ఆర్ధిక కష్టాల్లో ఇరుక్కున్న సమయాల్లో టాలీవుడ్ కి విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అది సూపర్ సక్సెస్ అయింది.తాజా గా ఆయన టాలెంట్ మ్యానెజ్మెంట్ కంపెనీ ని ప్రారంభించారు.
11) శ్రుతి హాసన్ (Telugu Movie Heroine) :
శ్రుతి హాసన్ సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. దాని ద్వార యానిమేషన్ ఫిలింస్, వీడియో రికార్డింగ్స్, ఎడిటింగ్, డబ్బింగ్ వంటి సినీమా పరమైన అంశాలన్ని నిర్వహిస్తుంది.
12) నందమూరి కల్యాణ్ రామ్ (Telugu Movie Hero & Producer) :
హీరోల్లో ఈయన ఒక్కరి పేరే వ్యాపార రంగాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన ఇప్పటికే పలు చిత్రాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇంకా ఆయనకి వి ఎఫ్ ఎక్స్ అనే స్టూడియో కూడా ఉంది. దీనిని 2014 లో ప్రారంభించారు.
ఎన్ టి ఆర్ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థ కుడా ఆయనదే .
13) రానా ధగ్గుపాటి (Telugu Movie Hero) :
భళ్ళాల దేవుడు రానా వ్యాపార రంగం లో అడుగు పెట్టాడు. ఆయన పూణే లో టాలెంట్ మ్యానెజ్మెంట్ కంపెనీ ని ప్రారంభించారు. సినీ రంగంలో కి ప్రవేశించేవారికి ఇది సహాయం చేస్తుంది. శిక్షణ ఇవ్వడం తో పాటు, సినీ అవకాశాలను సైతం చూపిస్తుంది.
14) అల్లు అర్జున్:
అల్లు అర్జున్ ఎం కిచెన్ పేరుతో ఇంటర్నేషనల్ గ్రూమింగ్ కంపెనీ ని ప్రారంభించారు. దీని కింద 800 ల జూబ్లీ పేరుతో గ్రూమింగ్ నైట్ క్లబ్ రెస్టారెంట్ ల ను నిర్వయిస్తున్నారు, మిగతా నగరాల్లోను తన క్లబ్బులను ఏర్పాటు చేసుకునే పని లో ఉన్నారు అల్లు అర్జున్.
15) తమన్నా :
మిల్క్ బ్యూటీ తమన్నా కూడా వ్యాపార రంగం లోకి ప్రవేశించింది. తన కుటుంబ వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో భాగంగా వైట్ అయిండ్ గోల్డ్ పేరు తో బంగారు నగల వ్యాపారాన్ని 2015 లో ఆరంభించింది. వజ్రాలు పొదిగిన నగల విక్రయం జరిపే స్టోర్లను ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఏర్పాటు చేసింది. తాను విక్రయిస్తున్న నగలకు తానే డిజైనర్ కూడా, తన డిజైనర్ నగల ను 12000 ల నుంచి అందుబాటులో ఉంచినట్టు తమన్నా తెలిపింది.
16) విజయ్ దేవరకొండ :
యువ హీరో విజయ్ దేవరకొండ వరుస హిట్టు ల తో మంచి ఫాము లో ఉన్నాడు. ఆయన సినీమాలతో పాటు వ్యాపారం మీద దృష్టి పెట్టారు. తాజా గా రౌడీ అనే పేరు తో ఒక సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించారు. ఫ్యాన్స్ సమక్షం లో తన బ్రాండ్ ను ఆవిష్కరించారు. ఈ దుస్తులకి ఇపుడు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
17) సందీప్ కిషన్ :
సందీప్ కిషన్ నటుడు,నిర్మాత మాత్రమే కాదు బిజినెస్‌మ్యాన్ కూడా. హైదరాబాద్, సికింద్రాబాద్ ల లో వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్స్ ను ప్రారంభించారు. వాటిని విజయవంతం గా నిర్వయిస్తున్నారు. అమరావతి లో ఒక సెలూన్ ప్రారంభించారు.సెలూన్ అంటే సాదా సీదా సెలూన్ కాదు. ఫ్యాషన్ ,స్టైలిష్ రంగం లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న క్యు బి ఎస్ ఎస్ సెలూన్ ఫ్రాన్‌చైసీ ను సందీప్ కిషన్ తీసుకోని అమరావతి లో ఆరంభించారు.
18) షారుఖ్ ఖాన్ (Hindi Movie Hero):
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ అత్యంత విలాసవంతమైన, విజయవంతమైన వ్యాపారి. ఆయన కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్. దీని బ్రాండ్ విలువ వేల కోట్ల రూపాయలల్లోనే ఉంది.
19) శిల్పా షెట్టీ :
సాగర కన్య శిల్పా షెట్టీ ఐ పి ఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి యజమాని గా వ్యవహరించారు. ఆ తరువాత అందులోని వాటాలను విక్రయించేసి ఫిలిం ప్రొడక్షన్ సంస్థ ని స్థాపించారు. అనంతరం లోసిస్ పేరు తో స్పా అయిండ్ సెలూన్ వ్యాపారం లోకి అడుగు పెట్టారు. ఫిట్‌నెస్ యోగా డి వి డి లను కూడా విడుదల చేస్తున్నారు.
20) సునీల్ షెట్టీ :
బాలీవుడ్ లో అతిపెద్ద వ్యాపార వేత్తల్లో సునీల్ షెట్టీ ఒకరు. ఫిట్‌నెస్ సెంటర్ వ్యాపారాల తో మొదలు పెట్టారు. తరువాత పాప్‌కార్న్ పేరుతోప్రొడక్షన్ సంస్థ ని స్థాపించారు.
21) సల్మాన్ ఖాన్ :
సల్మాన్ ఖాన్ కి పలు వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి. ఆయన బి హింద్ పేరు తో దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. దీనితో సేవాక్రమాలు కూడా చేబడుతుంటారు. దీనితో పాటు బి హింద్ స్మార్ట్ పేరుతో మొబైల్ ఫోన్ల వ్యాపారాలం లో అడుగుపెట్టే అందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఆయనకి యాత్రా.కాం (yatra.com) లో కూడా ఈయనకి వాటాలు ఉన్నాయి.