జాతీయం-అంతర్జాతీయం

5 Best Places Near Hyderabad: హైదరాబాద్ సమీపంలోని మనోహరమైన పర్యాటక ప్రదేశాలు

Best Places Hyderabad
Best Places Near Hyderabad: హైదరాబాద్ కు 100కిమీ సమీపం లో కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని

1) అనంతగిరి హిల్స్ :

Best Places Near Hyderabad
The natural beauty of ananthagiri attracts many visitors | Photo credit: Praveen120/Wikipedia

One of Best Places Near Hyderabad: హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల లోపు సమీపంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాలలో అనంతగిరి కొండలు ఒకటి . కొండల సమీపంలో ఉన్న చుట్టుపక్కల అడవులు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని ఇస్తాయి .మరియు కొండపైకి చేరుకున్నప్పుడు, అక్కడి ప్రదేశం కనులకి ఇంపుగా మొత్తం గ్రీనరి గా ఎంతో అందంగా ఉంటుంది. ఇది వికారాబాదు బస్ స్టాండ్ కు 7 కి.మీ. దూరంలో ఉంటుంది.

అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణలలో ఒకటి మరియు ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ప్రదేశంలో రెండు ట్రెక్కింగ్ మార్గాలు కూడా ఉన్నాయి, ట్రెక్కర్లకు ఇది మంచి ప్లేస్ . ఈ సుందరమైన హిల్ స్టేషన్ ను  వీకెండ్ లో చాలా మంది సందర్శిస్తారు.

విసిటింగ్ టైమింగ్స్ – ఆలయ టైమింగ్స్ ఉదయం 5 am గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8.30 pm వరకు ఉంటాయి.

ఇది హైదరాబాద్ నుండి 79కిమీ దూరం లో ఉంది.

2)యాదగిరిగుట్ట(నల్గొండ):

Best Places Near Hyderabad - Yadagirigutta

One of Best Places Near Hyderabad: హైదరాబాదు కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ టెంపుల్స్ లో 100 కిలోమీటర్ల లోపున ఉన్న ప్రముఖ హిందూ టెంపుల్స్ లో ఇది ఒకటి. గొప్ప పురాణాలతో కూడిన కొండమీద ఉన్న ఈ ఆలయం యాత్రికులను మరియు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. విష్ణువు యొక్క బంగారు సుదర్శన్ చక్రముతో పాటు మొత్తం ప్రదేశం యొక్క కట్టడం ఆకర్షిస్తుంది.

ఈ యాదాద్రి టెంపుల్ ఘాట్ రోడ్ లో నల్గొండ జిల్లా, తెలంగాణ లో ఉంది.

విసిటింగ్ టైమింగ్స్ – ఆలయ టైమింగ్స్ ఉదయం 4 am గంటల నుండి రాత్రి 9.45 pm వరకు ఉంటాయి, ఈ ఆలయానికి  దర్శన ధర Rs 100/- మరియు విఐపి (VIP)  దర్శన ధర Rs 150/-  గా ఉంది.

ఇది హైదరాబాద్ నుండి 60కిమీ దూరం లో ఉంటుంది.

3)భువనగిరి కోట :

Bhuvanagiri Fort

One of Best Places Near Hyderabad: 10వ శతాబ్దానికి చెందిన భువనగిరి కోట 100 కిలోమీటర్ల లోపు హైదరాబాద్ సమీపంలోని పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ఒక ప్రత్యేకమైన గుడ్డు ఆకారంలో ఉన్న ఏకశిలా శిలపై ఉంటుంది. అద్భుతమైన కట్టఆడం తో ఉన్న ఈ కోట మంత్రముగ్ధులను చేస్తుంది. ఇతిహాసాలు చరిత్ర పేజీలలో ఈ కోట గురించి గొప్పగ రాసారు.

కోట మరియు, కోట యొక్క చుట్టుపక్కల దృశ్యం ఆహ్లాదకరంగా ఉంటుంది .

ఈ భువనగిరి కోట యదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ లో ఉంది.

విసిటింగ్ టైమింగ్స్ – ఆలయ టైమింగ్స్ ఉదయం 10 am గంటల నుండి సాయంత్రం 5 pm వరకు ఉంటాయి.

దీనికి ప్రవేశ రుసుము Rs 5 /- గా ఉంది.

ఇది హైదరాబాద్ కు 101 కిమీ దూరం లో ఉంది.

4) రామోజి ఫిల్మ్ సిటీ :

Ramoji Film City

One of Best Places Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో 100 కిలోమీటర్ల పరిధిలో సందర్శించే బెస్ట్ ప్రదేశాలలో, రామోజి ఫిల్మ్ సిటీ ఒకటి. భారతదేశంలోని ఈ అతిపెద్ద ఫిల్మ్ సిటీ లో అమ్యూజ్ మెంట్ పార్క్ మరియు అనేక వినోద కేంద్రాలు ఉన్నాయి. రామోజి ఫిల్మ్ సిటీ లో రంగురంగుల స్టూడియో సెట్లను చూడవచ్చు.

కాంప్లిమెంటరీ రైడ్ లను , ఎంటర్ టైన్ మెంట్ షోలను చూడవచ్చు. భారతదేశంలో సినిమాలు షూటింగ్ చేసే ప్రదేశాలలో ఇది ఒకటి.

రామోజి ఫిల్మ్ సిటీ అనేది రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ రోడ్, తెలంగాణ లో ఉంది.

విసిటింగ్ టైమింగ్స్– రామోజి ఫిల్మ్ సిటీ టైమింగ్స్ ఉదయం 9 am గంటల నుండి సాయంత్రం 5.30 pm వరకు ఉంటాయి. దీనికి ప్రవేశ రుసుము Rs 1150/-  గా ఉంది.

సిటీ సెంటర్ కు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ ఇది.

5)మృగవని నేషనల్ పార్క్:

Best Places Hyderabad

One of Best Places Near Hyderabad: అనేక వృక్ష మరియు జంతుజాలంతో కూడిన ఈ మృగవని నేషనల్ పార్క్ ను ప్రతి సంవత్సరం అనేక మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. పార్కులోకి లోపలికి వెళ్తే,  పునుగు పిల్లులు ,  భారతీయ ఎలుక పాము(ధమన్) ,  రక్త పింజరి మరియు అనేక ఇతర రకాల జంతువులను చూడవచ్చు.

నెమళ్ళు, కౌజు పిట్టలు, వేట పక్షులు,  బాబ్లర్  మరియు  ఇతర అనేక జాతుల పక్షులు  కనులకు  విందుగా ఉంటాయి, పచ్చని పరిసరాలు  రిఫ్రెషింగ్  రిట్రీట్ గా ఉంటాయి.

ఈ మృగవని నేషనల్ పార్క్ అనేది మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ లో ఉంది.

విసిటింగ్ టైమింగ్స్ – మృగవని నేషనల్ పార్క్ టైమింగ్స్ ఉదయం 9 am గంటల నుండి సాయంత్రం 5 pm వరకు ఉంటాయి.

దీనికి ప్రవేశ రుసుము Rs 5/- మరియు జీప్ సఫారి మనిషికి Rs 50/- ఉంది.

ఇది హైదరాబాద్ కు 21 కిమీ దూరం లో ఉంది.

ఇది కూడా చదవండి : ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ నిషేధం?