Xiaomi 5G Phones: షియోమి చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ సంస్థ జూన్ లో మరో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేయనుంది, అవి రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ, రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ, షియోమి రెడ్‌మి 10 ఎక్స్, ఇవి మూడు 5జీ మొబైల్ ఇంటర్నెట్ ను కలిగి వుండబోతున్నాయి, వీటి ధర రూ 20000/- లోపు ఉండబోతుంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు 6.5 తాకే తెరను కలిగివున్నాయి, ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు ఒకేలా ఉండబోతున్నాయి, వీటిలో రెడ్‌మి నోట్ 10 ప్రో 5 జి ఫోన్ 4జీబీ RAM కలిగి వుండగా మిగతా రెండు ఫోన్లు 6జీబీ RAM కలిగి వున్నాయి, రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ మోడల్‌లో మాత్రం క్వాడ్ కెమెరా సెటప్ ఉంటే మిగతా వాటిలో ట్రిపుల్ కెమెరా ఉంది మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ 108 పిక్సల్స్ ప్రైమరీ కెమెరా వుంది, ఒకే నెల లో షియోమి ఈ మూడు మొబైల్స్ ను రిలీజ్ చేయబోతుంది. ఈ మూడు మొబైల్స్ 5జీ నెట్ వర్క్ ను కలిగి వున్న ఇండియా 5జీ నెట్ వర్క్ కు సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం షియోమి వెల్లడించలేదు, ఈ మూడు మొబైల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం (image: Xiaomi Redmi India).
Xiaomi రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ
(ప్రతీకాత్మక చిత్రం)
రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, ఇది Li-Polymer 4820 mAh బ్యాటరీ కలిగి వుంది, ఇది 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ 17,990/- ధరకు జులై 22కు రిలీజ్ కాబోతుంది (image: Xiaomi Redmi India).
Xiaomi రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ
రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.50 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 MT6833 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది Li-Polymer 5000 mAh బ్యాటరీ కలిగి వుంది, ఇది 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ 14,590/- ధరకు జూన్ 17న రిలీజ్ కాబోతుంది (image: Xiaomi Redmi India).
Xiaomi రెడ్‌మి 10 ఎక్స్
షియోమి రెడ్‌మి 10 ఎక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.57 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 820 MT6875 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వెనుకవైపు కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, ఇది Li-Polymer 4520 mAh బ్యాటరీ కలిగి వుంది, ఇది 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ 16,990/- ధరకు జూన్ 27న రిలీజ్ కాబోతుంది (image: Redmi India).