సాయి మహిమలుఆధ్యాత్మికం

Saibaba : సాయిబాబా జీవిత చర్రితము – రోహిల్లా కథ – అధ్యాయము 3

Saibaba Rohilla

సాయిబాబా  (Saibaba) జీవిత చర్రితము: రెండవ అధ్యాయములో వర్ణించిన ప్రకారం  శ్రీ సాయి సత్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి ఇచ్చుచు ఇట్లనిరి, “సత్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి  సహకారం వుంటుంది,  నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకు,  మనసును  నిలకడగా నుంచుము,  నా మాటలయందు నమ్మకం వుంచు,  నా లీలలు వ్రాసినచో నవిద్య నిష్రమించి  పొవును, వానిని భక్తి- శ్రద్దలతో ఎవరైతే వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును, బలమెైన భక్త ప్రరమ క ర్టములు లేచును.   ఎవరైతే నా లీలలలో  మునిగెదరో వారికి  జ్ఞానరత్నములు లభించును.” ఇది  విని రచయిత  మిక్కిలి  సంతోషించెను,  వెంటనే నిర్భయుడయ్యెను,  కార్యము  జయప్రదముగా సాగాలని ధైర్యము కలిగెను.

ఇప్పుడు మూడవ  అధ్యాయములో బాబా కథలు – వారి ప్రేమ  – సముద్ర మధ్యన దీపస్తంభాలు, రోహిల కథ, సాయి రోహిలను సమర్దించుట, బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు గురించి ఈ అధ్యాయములో వివరించును.

మాధవరావు దేశపాండేను చూసి బాబా యిట్లనెను, ” నా నామము  ప్రేమతో  ఉచ్చరించిన  వారి కోరికలన్నియు తీరుస్తాను, వారిని అన్ని దిశలయందు కాపాడెదను,  ఏ భక్తులయితే మనస్ఫూర్తిగా నాపై ఆధారపడి ఉన్నారో వారీ కథలు వినునప్పుడు మిక్కిలి  సంతోషించెదరు, నా   కథలను గానం చేసేవారు, కధనం చేసేవారు నన్ను సదా తమ ముందు వెనకాల దర్శిస్తూ ఉంటారు, తమ చుట్టంతా నేను ఉండడం చూస్తారు, నా కథలను వినినచో సకల రోగాలు నివారించును.

కాబట్టి   భక్తి- శ్రద్దలతో నా కథలను వినుము, వానిని మనములో  నిలుపుకొనుము, నా భక్తుల యొక్క  గర్వాహంకారము తొలగిపోవును, ” సాయి సాయి యను నామమును జపించడం వల్ల  చెడు పలుకులు వినుటవలన కలుగు పాపాలు నశిస్తాయి ” అని బాబా వివరించారు.

సాయి బాబా (Saibaba) కథలు – దీపస్తంభాలు

సముద్ర మధ్యమున  దీపస్తంభాలుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురువల్ల,  రాళ్ళురప్పలవల్ల కలుగు హాని తొలగించి సురక్షితంగా పోవుదురు, ప్రపంచం అను మహాసముద్రంలో బాబా కథలను దీపము దారిచూపును, అవి అమృతంకంటె తియ్యగా నుండి  ప్రపంచయాత్ర మార్గమును సులభముగును, యోగీశ్వరుల కథలు పవిత్రములు . అవి మన చెవుల ద్వారా హృదయం చేరినపుడు అహంకారము  నశించును, శరీర గర్వము తొలగి కావలసినంత జ్ఞానం పొందును, శ్రీ సాయిబాబా (Saibaba) కీర్తన, వర్ణనలు ప్రేమతో పాడినగాని,  వినినగాని భక్తుల పాపాలు పటాపంచలగును,  కాబట్టి ఇవి  మోక్షమునకు సులభసాధనము.

సాయి బాబా – హేమాండ్ పంత్

ఒక ఆవు తన దూడ మీద తన మాతృప్రేమను ఎలా చూపుతుందో, ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటుందో, బాబా కూడా తనను నమ్మిన భక్తులను తన బిడ్డలుగా చూసుకుందురు,  దానికి ఒక ఉదాహరణ చెప్తాను.

1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగం నుంచి విరమించాను, నాకు పెన్షన్ ఏర్పాటయింది, కానీ అది నాకు సరిపోవడంలేదు నా కుటుంబం పెద్దదైంది అని, అణ్ణాచించణీకర్ నా గురించి బాబాతో చెప్పేను. అందులకు బాబా “హేమండ్ కి ఇంకో ఉద్యోగం దొరుకును, అప్పటివరకు నా సేవలో తృప్తిపడవలెను, అతని భోజనపాత్రలు అప్పుడు సంపూర్ణముగానే నిండి ఉంటాయి, వాని దృష్టి అంతటిని నాఫై త్రిప్పవలెను. నన్ను మనస్ఫూర్తిగా పూజించినచో వాడు ఎల్లపుడు ఆనందముగా ఉండును అని బాబా పలికెను.

Saibaba

సాయి బాబా హరతి దర్శనం

రోహిల్లా కథ

బలవంతుడునగు రోహిల్లా యొకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిరంగా నివాసం ఏర్పర్చుకొనెను, అతను పొడవుగా ఉండి పొడవాటి చొక్కా వేసుకొని చూడడానికి గంభీరముగా ఉండేవాడు, అతను రాత్రిపగళ్ళు ఖురాన్ లోని  కల్మాను చదువుతూ “అల్లాహు  అక్బర్” అని బిగ్గరగా అరుస్తూవుండేవాడు, అక్కడ ఉన్న షిరిడీ ప్రజలందరికీ నిద్రించు సమయంలో  అసౌకార్యముగా ఉండేది, ఇలా కొన్నాళ్లు భరించి తుదకు అతని గోల భరించలేక బాబా దగ్గరికి వెళ్ళి వేడుకోనెను.

సాయి రోహిలను సమర్దించుట

ప్రజలంతా బాబా (Saibaba) దగరికి వెళ్ళి రోహిల్లా అరుపులను అపమని వేడుకొనెను, దానికి “బాబా చెప్పింది వినకపోగా వారిపైన కోపించి, అతని జోలికి పోవద్దని, వారి పని వారిని చూసుకోమని చెప్పి, రోహిల్లాకు గయ్యాళి భార్య ఉందని ఆమె ఎప్పుడు అతనిని బాధ పెడుతూ ఉంటదని ఆమె గోల భరించలేక అలా చేస్తున్నాడని చెప్పి కొన్నాళ్లు  వరకు నోర్చుకొని చెప్పి వాళ్ళందరిని పంపించెను”. నిజానికి అతనికి భార్య లేదు, ఎవరూ లేరు, భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము, . బాబాకు అన్నిటి కంటే దైవప్రార్థనలయందు మిక్కిలి ప్రేమ. అందుకే బాబా రోహిల్లా తరుపున వాదించి షిరిడీ ప్రజలను పంపిచిరి.

బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యనాహారతి అయిన పిమ్మట భక్తులందరు తమ తమ బసలకు వెళ్ళుచుండిరి, అప్పుడు బాబా (Saibaba) ఇలా చక్కని ఉపదేశమిచ్చిరి ” మీరు అక్కడవున్న ఏమి చేయుచున్న వెంటనే నాకు తెలియును అని  జ్ఞాపకం ఉంచుకోండి, నేను అందరి హృదయంలో నివసిస్తాను, అన్ని జీవరాశులలో నేనే ఉంటాను, దృశ్యమాన చరాచరజీవరాశులలో పురుగులులలో, చీమలలో యంతయు నా శరీరమే, నా రూపమే, నేనే జగన్నాతను, జగత్తును నడిపించే సూత్రదారి నేనే అని బాబా పలికెను.

ఈ చక్కని మాటలను విని నా మనసులో ఎవరి సేవ చేయక గురుసేవచేయాలని  అనుకొంటిని, కానీ   అణ్ణాచించణీకర్   ప్రశ్నకు, బాబా (Saibaba)  చెప్పిన సమాధానం నా మనసులో ఉండెను, అది జరుగునా లేదా అని సందేహం ఉండెను కానీ చివరికి బాబా చెప్పిన మాటలు నిజం అయ్యెను, నాకు ఇంకో సర్కార్ ఉద్యోగం వచ్చింది, కానీ అది కొంతకాలం వరకు మాత్రమే చేసి తరువాత వేరే పనియును లేక శ్రీ సాయి బాబాసేవకే నా జీవితం సమర్పించితిని.

ఈ  అధ్యాయము ముగించు ముందు, చదువరులకు నేను చెప్పేది ఏమనగా బద్ధకం, చంచలమనసు, నిద్ర, శరీరంపై అభిమానము అన్నియు విడిచి బాబా కథల వైపు త్రిప్పవలెను, వారి ప్రేమ సహజంగా ఉండవలెను, వారు భక్తి యొక్క రహస్యం తెలుసుకొందురు అనగా బాబా కథలను వినుదురుగాక, ఇట్లా చేసినచో అజ్ఞానము నశించి, మోక్షమును సంపాదించికొని, బాబా (Saibaba) కూడా ఎల్లవేళలా మీ హృదయంలో నిలుచునుగాక.

ఇది కూడా చదవండి : హేమాండ్ పంత్ నామకరణం – అధ్యాయము 2