Sai baba సాయిబాబా జీవిత చర్రితము: మొదటి అధ్యాయము లో గోధుమలను విసరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింతను తెలియజేసేను.
ఇప్పుడు రెండవ అధ్యాయములో బాబా యొక్క లీలలు, బాబా కథాయజ్ఞం, రచనకు బాబా అనుమతి, సాయి ఉపదేశం, సాయి కథల ఫలం, హేమాండ్ నామకరణం, గురువుపై అపనమ్మకం, రచయత షిరిడి చేరుట, రచయతకు సాయి దర్శనం, సాయి దర్శనమహిమ, రచయతకు సాయి హేమాండ్ పంత్ అని అనడం, హేమాండ్ కు మేలుకొలుపు గురించి ఈ అధ్యాయములో వివరించును.
బాబా(Sai baba) లీలలు
ఈ గ్రంథప్రయోజనము గురించి ఈ కథలో చెప్పుకుందాం, బాబా లీలలు ధన్యత కలిగిస్తాయి, భక్తులకు బోధనమార్గం అవుతాయి, పాపాలను నశింపచేస్తాయి, ఈ కథలు సుఖశాంతులని ఇస్తాయి, బాబా చెప్పిన కథలు రకరకాలు గా ఉన్నాయి, అవికొన్ని వ్యావహారిక ఉపదేశాత్మకాలు, కోన్నీ సామాన్య అనుభవాలకు సంబంధిచిన, మరికొన్ని బాబా బాబా దివ్యకర్మలను వివరించును.
బాబాను నిజంగా చూడనివారు ఎంతో మంది ఉన్నారు. వారు ఈ కథలను వినడం, చదవడం వల్ల మీరు బాబా ని మానసికంగా దర్శిస్తారు. ఈ కథలు చదవడం వల్ల పరమానందం కల్గుతుంది.
రచనకు బాబా అనుమతి
హేమాండ్ పంత్ కు షష్ఠిపూర్తి అయినది, అతని అసలు పేరు అన్నాసాహెబ్. (Sai baba) బాబా కథను గ్రంథస్థం చేయాలన్న ఆలోచన మాధవరావుకు చెప్పారు, బాబా దగ్గరకు వెళ్లి మాధవరావు ఈ అన్నాసాహెబ్ నీ జీవిత చర్రితమును వ్రాయాలనుకుంటున్నారు.
మరి దీనికి మీ అనుమతి కావాలి కదా! అప్పుడు బాబాను పకీరుని కదా, నా గురించి రాసేదేముంది అని మాత్రం నువ్వు చెప్పవద్దు, నీ అనుమాతి తప్పక కావాలి, అదే లేకపోతే ఏలాంటి రచన కూడాసరళంగా రాయలేము అని మాధవరావు బాబాకు చెప్పాడు.
సాయి ఉపదేశం
(Sai baba) బాబా ప్రేమతో అనుమతించి, దీవించారు. కేవలం నువ్వు నిమ్మిత్తమాత్రుడవు నా కథను నేనే వ్రాయించుకుంటాను, నువ్వు ముందుగా నీలో ఉన్న అహంకారాన్ని త్యాగం చేసి వ్రాయు.
అహంకార రహితులు ఉన్న వారికి నేను పూర్తిగా సహకారం చేస్తాను, వాటి ఆనవాళ్లు కూడా కనిపించకూడదు, అప్పుడే నేను వాళ్లలో నివసిస్తాను అని బాబా చెప్పారు. నువ్వు శ్రవణం మరియు మననం చేస్తూ రచన ప్రారంభించు, నన్నుకర్తగా అనుకోని నువ్వు కార్యానికి సిద్దమవ్వమని బాబా అన్నాసాహెబ్ (హేమాండ్ పంత్) కి చెప్పారు.
సాయి కథల ఫలం
(Sai baba) బాబా ఎక్కడైతే భక్తి- శ్రద్ధలు ఉంటాయో అక్కడే బాబా ఉంటాడు, ఏ మాత్రం లేకపోయినా వారి అందుబాటులో ఉండకుండా పోతారు. బాబా కథలను వినడం, చదవడం వల్ల బాబాపై భక్తి- ప్రేమ అనేది ఏర్పడుతుంది. దాని వల్ల ఆత్మానుభూతి, ఆత్మానందం కల్గుతుంది, ఇంతకన్నా మనిషికి ఏం కావాలన్నారు బాబా.
హేమాండ్ పంత్ నామకరణం
ముందుగా హేమాండ్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం! ఈ రచయత మొదట్లో అల్లరివాడిగా ఉండి, ఇతరులను నిందించడం, హేళన చేయడం ఇతని స్వభావంగా ఉండేది, తనకున్న గర్వం చూసుకొని వాద వివాదాల్లో తల దూర్చేవాడు.
హేమాండ్ను కాకాసాహెబ్ ఒకసారి షిరిడి రమ్మని అడిగాడు, అతని ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళడానికి సిద్దమయ్యాడు. అంతలోనే తన ప్రాణస్నేహితుడి కుమారుడు జబ్బు చేసి ఉన్నాడు, తన స్నేహితుడు గురుదీక్ష పొంది గురుపుత్రుడయ్యాడు, అతని కుమారున్ని కాపాడుకోడానికి తన గురువును తీసుకొచ్చారు, అతను తన కుమారుని పక్కనే కుర్చునాడు కానీ ఆ గురువు ఎన్ని చేసిన లాభం లేకుండా పోయింది, అతను కూడా ఏం చేయలేకపోయాడు, చివరికి అతని కుమారుడు మరణించాడు.
గురువుపై అపనమ్మకం
మానవ జీవితం విచిత్రమైనది: ఎవరు భార్యా? ఏవరు కొడుకూ? అంతకర్మానుసారం జరుగుతుంటాయి. మన ప్రారబ్ద కర్మను అనుభవించక తప్పదు. హేమాండ్కు విషయం తెలిసి దాంతో అతని మనసు బాధ పడింది, ఈ సంఘటన అతని మనుసునుబలహీనం చేసి, గురువు వల్ల ప్రయోజనం ఇంతేనా? అతని కుమారున్ని గురువు కూడా రక్షించలేకపోయాడే? అని అనుకున్నాడు.
దాంతో అతనికి బాబాని చుడాలన్నా కోరికను తగ్గించింది, షిరిడీ వెళ్లకుండా ఆపేసింది, ప్రారబ్దము ముందు గురువేంచేయగలడు అని అనుకుంటూ, ఏది ఏలా జరిగేదివుంటే అలా జరుగును దాన్ని ఎవరు ఆపలేరు, దానికి గురువు అవసరం ఏముంది అని అనుకున్నాడు. ఆ ఆలోచనల మూలంగా షిరిడీ వెళ్లడం మానుకున్నాడు, ప్రారబ్ద కర్మను ఏవరు ఆపలేరు కాబట్టి నన్ను చివరికి షిరిడీకి లాక్కెళ్ళింది.
రచయత షిరిడి చేరుట
రచయతను షిరిడి అప్పుడు వెళ్తున్నావు అని నానాసాహెబ్ అడిగారు అతను గ్రామాధికారి.హేమండ్ తన మనసులో ఉన్న విషాదాన్ని అంతా చెప్పాడు, నా ప్రాణస్నేహితుడి కుమారుడు మరణించడంతో నాకు శిరిడీ వెళ్ళడానికి కుతూహలం తగ్గింది అన్నాడు. దాంతో నానాసాహెబ్ ఒక మంచి సలహా ఇచ్చారు, అతని సలహాకు రచయత మనసు సంతోషంతో అంగీకరించి
శిరిడీ ప్రయాణంకు సిద్దమయ్యి సాయంత్రం రైలు దాదర్లో ఆగుతుందని, దాదర్కు టికెట్ తీస్కున్నాడు, రైలు రాగానే ఎక్కేసాడు, అంతలో ఓ ముస్లిం నా బోగిలోకి ఎక్కి అక్కడికి వెళ్తున్నావ్ అని అడిగాడు, దానికి రచయత, నేను దాదర్ వెళ్లి అక్కడ మన్మాడ్ రైలు ఎక్కాలని చెప్పాడు. దాంతో అతను నువ్వు దాదర్ లో దిగకు అక్కడ రైలు ఆగదు, నువ్వు నేరుగా విక్టోరియా టర్మినస్ కు వెళ్ళు అని సలహా ఇచ్చాడు.
అలా అతను సమయానికి చెప్పినందుకు 9-10 గంటల సమయానికి శిరిడీ చేరుకున్నాను. అక్కడ రచయత కోసం బాబూసాహెబ్ దీక్షిత్ ఎదురుచూస్తూ ఉన్నాడు అప్పట్లో 1910 లో యాత్రికుల కోసం సాఠెవాడాలో వసతి ఉండేది. టాంగా దిగగానే హేమండ్ కు బాబాను చూడాలని ప్రాణం కోరుకుంటుంది.
అంతలో తాతా సాహెబు నూల్కర్ ఇప్పుడు బాబా వాడా చివర ఉన్నారని చెప్పాడు.ఉన్న ఫలానా వెళ్లి బాబాను దర్శించు, తరువాత బాబా లెండి నుండి మసీదుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు స్నానం చెసి మళ్ళి బాబా దర్శనము కోసం మసీదుకు వేళ్ళుమని చెప్పాడు. ఇప్పుడు అయితే ముందుగా వెళ్ళి చూడు అని తాతా సాహెబు నూల్కర్ హెచ్చరించాడు.
రచయతకు బాబా (Sai baba) దర్శనము
అది విని వెంటనే సాయి ఉన్న చోటుకు వెళ్ళాడు, (Sai baba) బాబా పాదాలను నమస్కరించి అనుగ్రహితుడయ్యాడు. సాయి దర్శనము ఒకటి ఉంటె చాలు అది మనిషిని సంపూర్ణంగా మార్చివేస్తుంది అని, మన దృష్టి ఒక సారి సాయిని చూస్తే మనకు అంతా సాయిమయం గోచరిస్తుంది అని హేమండ్ సంతోషంతో తన మాటలను చెప్తూ ఉన్నాడు.
శిరిడీకి వచ్చిన మొదటి రోజే హేమాండ్ పంత్ కి, బాలా సాహెబుకును గురువు యావశ్యకత గూర్చి గొప్ప వివాదము జరిగేను. ఒక వ్యక్తి తన స్వేచ్ఛజీవితం అందుకు గురువుకు త్యాగం చేయాలి? అలాంటి వివాదాలు జరిగాయి, చివరికి ఏటు తేలకుండా పోయింది, ఆ వాదా వివాదాల వల్ల ఫలితం ఏం లేకపోగా మనశాంతి కూడా కోల్పోయాడు. ఇలా జరిగిన తర్వాత అందరితో పాటు రచయత కూడా మసీదు కి వెళ్ళాడు.
అక్కడ బాబా, కాకాసాహెబ్ న “అవును, ఆ వాడా లో ఏం జరిగింది? ఆ వాదనలు ఏమిటి? అని రచయతను చూస్తూ ఆ హేమండ్ పంత్ ఏమంటున్నాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న రచయత సిగ్గుపడుతూ తల కిందకేసాడు, మొదటి దర్శనములోనే నేను ఇలా చేశాను ఏమిటి అనుకోని, నన్ను బాబా హేమండ్ పంత్ అని నేను ఉదయం చేసిన తీవ్రవాదం ఫలితంగా నాకు పేరు రావడం కారణం అనుకున్నాడు, ఆ సంఘటననే బాబాకు హేమండ్ ను గుర్తుచేసింది అనుకున్నాడు.
యాదవ రాజులు దేవగిరికి చెందిన గొప్ప రాజులు. వారు 13వ శతాబ్దం చెందిన రాజులు, మహాదేవన్ అనే రాజు మంత్రి పేరు “హేమాద్రి”, అతను బహుగుణ శాలి, సంస్కృతంలో హేమండ్ పంత్ అనే పేరు వచ్చింది, కానీ అతని గోత్రం వేరే, నా గోత్రం వేరే, అతను పండితుడు, నేను అందుకు పనికి రాని వాడ్ని, నా కులం వేరే, అతని కులం వేరే ఐనప్పటికీ నాకు బాబా ఉరికే ఏ పేరు పెట్టలేదు.
నేను చేసిన వాదోపవాదాల వలన ఈ పేరు వచ్చింది అని, నా అహకారం త్రొ చడానికి హేమండ్ పంత్ అన్నమాట వచ్చింది, దాంట్లో సందేహం లేదనుకుంటారు. నేను నా వాదబిమానం అనే దుస్స్వభావాన్ని త్యాగం చేయడాన్కి ఈ బిరుదు వచ్చింది, నేను అప్పుడు గర్వంగా ఉండకుండా వినమ్రుడనై ఉండాలన్నా విషయం గుర్తు చేయడానికి పేరు వచ్చింది.
శ్రీరాముడు అంతటి అవతారపురుషుడుకి గురువు వశిష్ఠుని సేవించాడు, శ్రీకృష్ణుడు స్వయంగా పరబ్రహ్మనే అయినా అతను కూడా గురువును పూజించవల్సి వచ్చింది, అంతటి అవతారపురుషులతో చూసుకుంటే నేనెంతటి వాడని? నాకు ఎందుకు వాదము, తర్కం? అని అనుకోని, గురువు లేనిదే ఙ్ఞానం లేదు, మోక్షం లేదు, ఈ శాస్ర వచనాలు నా మనసులో పథిలంగా ఉండిపోయాయి, ఇతరులతోవాదం పనికి రాదు అని గ్రహించాడు.
మానవుడికి శ్రద్ధ – సబూరి -దైర్యం లేకపోతే పరమాత్మను ఆవగింజంత కూడా సాదించలేము, ఇలా నేను ఈ హేమండ్ పంత్ అనే పేరును శ్రద్ధ హృదయంతో, గౌరవప్రదముగా స్వీకరిస్తాను అనుకుంటూ అంతటికి సాయి నే అంతిమ గతి అని రెండవ అధ్యాయములో రచయత వివరించాడు.