సాయి మహిమలుఆధ్యాత్మికం

సాయిబాబా జీవిత చర్రితము: బాబా గోధుమలు విసిరిన కథ – అధ్యాయము 1

Saibaba-latests

సాయిబాబా గోధుమలు విసిరిన కథ – దాని తత్వము.

మొదటి అధ్యాయము

పూర్పసంప్రదాయం ప్రకారం హేమాడ్ పంత్ శ్రీ సాయిసత్చరిత్ర గ్రంథమును గురుదేవస్తూతితో ప్రారంభించారు .

ప్రప్రథమమున  వినాయకుడిని  స్మరించుచు ఆటంకములను తొలగించమని  గ్రంథమును జయప్రదముగాసాగాలాని వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తత శ్రీగణేషుడు అని చెప్పుచున్నారు, తరువాత సరస్వతి దేవిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వెడుకొని, గృహదేవతయగు  నారాయణ ఆదినాథునికి, చివరిగా తల్లితండ్రులకు నమస్కరించారు.

ఇక హేమాడ్ పంత్ గారు చెప్పిన కథ గురించి తెలుసుకుందాం!

1910 సం|| లో  యొకనాటి ఉదయమున హేమండ్ పంత్  షిరిడీ మసిదు లో నున్న సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళాడు .

అప్పుడు బాబా ముఖ్ప్రక్షాళ్నము గావించుకొని  గోధుమలు విసురుటకు సంసిద్దుడగుచుండెను. వారు  నేల మీద గొనె పరిచి దానిపై  యుంచిరి. చేట లో కొన్ని గోధుమలు పోసుకొని,  చోక్కా చేతులు  మడచి, పిడికెడు చొప్పున గోధుమలు  వేయుచు విసరసాగిరి. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అంత అశ్చర్యమగ్నులయ్యారు. కాని బాబాని అడగడానికి ఎవరు సాహసం చేయలేదు . ఈ విషయం గ్రామము అంతటా వ్యాపించి అందరూ బాబా దగ్గర గుమికూడిరి . అందులో నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లు ఎక్కి బాబాను పక్కకు జరిపి వారే విసిరుటను ప్రారంభించిరి. ఈ చర్యలని చూచి   బాబాకు కోపం  వచ్చేను. కానీ  వారి  ప్రేమ భక్తికి మిక్కిలి  సంతోషించి  చిరునవ్వుతో నవ్విరి. విసురునపుడు స్త్రీలు తమలోతాము మిట్లనుకొనిరి . బాబాకి ఎవరు లేరుకదా?  ఈ గోధుమపిండి ని బాబా ఏం చేసుకుంటారు మనకే ఇస్తారు అని అనుకుంటారు, అలా అనుకొని ఆ నలుగురు స్త్రీలు నాలుగు భాగాలుగా చేసుకొని తీసుకోడానికి సిద్ధం అయ్యారు. వెంటనే బాబా కోపం తో ఆ గోధుమపిండి ఎవరబ్బా సొమ్మన్ని,  ఏ కారణం చేత పిండిని తీసుకుంటున్నారు. సరే, పిండిని తీసుకొనిపోయి గ్రామం సరిహద్దులో చల్లుడి  అని చెప్పిరి బాబా ,  అది విని వాళ్ళు సిగ్గుపడి బాబా చెప్పినపని చేసిరి.

Sai baba (సాయిబాబా) Charitra Latests.in

నేనిదంతయు అదంతయు చూసి షిరిడీ ప్రజలకు బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని, గ్రామంలో కలరా జాడ్యము కలదని, దానిని  శాంతిపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు  విసరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యము విసరి ఊరికవతల పారద్రోలిరనియు  చెప్పిరి. అప్పటి నుండి  కలరా తగ్గెను. గ్రామం లోని ప్రజలంతా ఆనందించిరి.

బాబా షిరిడీలో సుమారు 60 ఏండ్లు  నివసించేను. ఈ కాలమంతయు విసురుచునే యుండురి! నిత్యము వారు విసిరినది  గోధుమలు కావు, భక్తుల  యొక్క  పాపాలు విచారాలు  మొదలగునవి. తిరగలి  యొక్క కింది భాగం రాయి కర్మ; మీద భాగం రాయి భక్తి; చేతిలో పట్టుకునిన పిడి  ఙ్ఞానోదయమునకు గాని, ఆత్మ సాక్షాతాకర్మునకు గాని మొట్టమొదట  పాపములను, కోరికలను తుడిచి  వేయవలయును. అహంకారము  చంపుకొనవలెను అనేది హేమండ్ పంత్ వివరంగా మొదటవ అధ్యాయంలో బాబా మహిమాలలో ఒక అద్భుతం వివరించేను.

ప్రతిరోజు చదివవలసిన దేవత సోత్రములు
Shirdi Sai Baba Online Darshan Live