Himanshu Rao Kalvakuntla : సీఎం కేసిఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు కు అరుదయిన గౌరవం దక్కింది, చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వారికి అందించే ప్రతిష్టాత్మక “డయానా” అవార్డ్ హిమాన్షును వరించింది.
గ్రామాలను స్వయం సమృద్ది సాధించే దిశగా తీసుకెళ్ళటమే లక్ష్యంగా శోమా (SHOMA) పేరుతో హిమాన్షు ఒక ప్రాజెక్ట్ ను చేపట్టారు, హిమాన్షు చేసిన ప్రయత్నానికి మెచ్చి ఈ అవార్డ్ ను ప్రకటించారు,.
ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడం లో తనకు మార్గదర్శకుడిగా నిలిచిన తన తాత సిఎం కేసిఆర్ కు హిమాన్షు (Himanshu) కృతఙ్ఞతలు తెలిపాడు.
దివంగత రాజకుమారి “డయానా” పేరు మీద 1999 నుండి ఈ అవార్డ్ లు అందచేస్తున్నారు, యువతకు ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉన్నది అనేది సంస్థ నినాదం, 9సంవత్సరాల నుండి 25సంవత్సరాలు వయసు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డ్ ఈసారి హిమాన్షు రావు కు దక్కింది.
సమాజం లో మార్పు కోసం మానవీయ దృక్పథం తో చేసే పనులకు ఈ అవార్డ్ ఇస్తారు, సమాజం లో మార్పు కోసం హిమాన్షు రావు (Himanshu) పదిహేనేళ్ళ వయసులోనే శ్రీకారం చుట్టాడు, గ్రామాలు స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యం తో సొంతంగా శోమా (SHOMA)పేరుతో ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
గజ్వేల్ నియోజక వర్గం లోని గంగాపూర్ యూసుఫ్‌ఖాన్ పల్లి ని ఎంపిక చేసుకోని స్పాన్సర్ల సహాయం తో కల్తీ లేని ఆహార పదార్థలను తయారు చేసే పరిశ్రమలను స్థాపించారు, ఆ పరిశ్రమలకు కావలిసిన ముడి పదార్థాలను సేకరించడం, వాటిని ప్రాసెస్ చేయడం, ప్యాకింగ్ చేయడం వంటి భాద్యతలను గ్రామస్థులకు అప్పగించారు.
అందులో పని చేసే వారిలో 50% మంది మహిళలే ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ లో వినియోగించిన యంత్రాలకు పూర్తిగా సౌర విథ్యుత్తు నే వాడారు, ఈ ప్రాజెక్ట్ తో మహిళలకు, యువతకు ఉపాధి కలిపించారు.
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్తిరాభివృద్ది లక్ష్యంలో తన ప్రాజెక్ట్ విజయవంతం అయింది అని హిమాన్షు రావు తెలిపారు.
గ్రామాల అభివృద్దికి ఆయన కృషిని బ్రిటన్ సంస్థ గుర్తించి ఈ ఏడాది డయాన అవార్డ్ ను అందచేసింది, ఈ అవార్డ్ ను వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో హిమాన్షు రావు అందుకున్నారు.
గంగాపూర్ యూసుఫ్‌ఖాన్ పల్లి లో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ విజయవంతంగా కొనసాగుతుంది, గ్రామస్థులు తమకు కావల్సిన పసుపు, కారం, గోధుమ పిండి ఆహార పదార్థాలను వారే స్వయంగా ప్రాసెస్ చేస్తున్నారు, దీనితో పలువురికి ఉపాధి కూడా దొరికింది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పిన హిమాన్షు రావు కు గ్రామస్థులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
శోమా (SHOMA) ప్రాజెక్ట్ కోసం సంపూర్ణ మార్గదర్శనం చేసిన తన తాత సిఎం కేసిఆర్ కు హిమాన్షు ఈ అవార్డ్ వచ్చిన సంధర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
గ్రామాలు స్వయం సమృద్ది సాధించేందుకు తనకున్న ఆలోచనల మేరకు చేపట్టిన ఈప్రాజెక్ట్ కు సహకరించిన రెండు గ్రామాల ప్రజలకు మరియు తన సలహాదారుల కు కృతఙ్ఞతలు తెలిపారు.
అటు మానవీయ కోణం లో చేసిన సేవలకు డయాన అవార్డ్ అందుకున్న తన కుమారుడిని మంత్రి కేటీఆర్ అభినందించాడు, అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నందుకు తండ్రిగా గర్వ పడుతున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ మేరకు ” ప్రౌడ్ ఫాదర్” అనే యాష్ ట్యాగ్ జత చేసారు.
హిమాన్షు (Himanshu) తన అవార్డు ను ట్విట్టర్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేసారు.