Agni Prime India : విజయవంతమయిన అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం.
భారత్ అగ్ని ప్రైమ్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరం లో పరీక్షించడం లో విజయవంతం అయింది, ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ కి 150కిమీ ల దూరం లో ఉన్న డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం ఐల్యాండ్ లోని టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ఉదయం 10.55గంటల సమయంలో అగ్ని మిసైల్ సిరీస్ లో భాగమైన అగ్ని ప్రైమ్ ను డీఆర్డీవో ప్రయోగించింది.
తూర్పు తీరం వైపు ఉన్న టెలిమెట్రి, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది.
అయితే అగ్ని ప్రైమ్ క్షిపణి అనేది రెండు ప్రధాన క్షిపణుల శక్తిసామర్థ్యాల కలయిక.
అగ్ని ప్రైమ్ (Agni Prime) మిసైల్ లో ఎన్నో అడ్వన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, ఇది ముఖ్యంగా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది 1000 నుంచి 2000 కి.మీ ల మధ్య శ్రేణి సామర్థ్యం తో దూసుకెళ్ళనుంది.
అగ్ని ప్రైమ్ (Agni Prime) మిసైల్ లో రెండు స్టేజీలు ఉన్నాయి, కొత్త రకం టెక్నాలజీ తో అగ్ని ప్రైమ్ మిసైల్ ను తయారు చేసారు, దీని బరువు పాత మిసైల్ లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
అగ్ని-1 మిసైల్ ను భారత్ లో 1989 లో ప్రయోగించారు, 2004వ సంవత్సరం నుండి ఆ మిసైల్ లు వాడుక లోకి వచ్చాయి.