జాతీయం-అంతర్జాతీయం

August 5th : ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు

August
August 5th : ఈ రోజు జరిగిన సంఘటనల ఆధారంగా ఆగస్టు 5వ తేదీ దేశచరిత్రలో నిలిచిపోతుందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

ఆగస్టు (August) 5వ తేదీ దేశచరిత్రలో నిలిచిపోతుందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు, అయితే రెండేళ్ల క్రితం ఇదే రోజున ఆర్టికల్ 370 రద్దు మరియు గతేడాది ఇదే రోజున రామ మందిరానికి శంకుస్థాపన జరగడం, మరియు భారత పురుషుల హాకీ టీం జర్మనీ టీ పై ఆగస్టు (August) 5న విజయం సాధించినది అని మోడీ మనకి అందరికీ గుర్తు చేశారు.

మోడీ ఉత్తరప్రదేశ్ లోని గరీబ్ కళ్యాణ్ యోజన దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు, గరీబ్ కళ్యాణ్ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 15 కోట్ల మంది లబ్ధిదారులు ఉచితంగా రేషన్ ని పొందుతున్నారు అని తెలియజేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో దాదాపు 80 వేల రేషన్ దుకాణాలు ఉన్నాయి, అయితే ఈ 80 వేల రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరఫరా చేయబడుతుంది అని తెలిపారు. గత ప్రభుత్వాలలో పేదలకు అందే ఆహారధాన్యాలు దోపిడీకి గురయ్యాయని మోడీ చెప్పారు.

August

కొన్ని ఏళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ ను కేవలం రాజకీయ కోణంలోనే చూశారని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశాల గురించి ఆలోచించలేదని మోడీ ఆరోపించారు కానీ కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధి పుంజుకొంది అన్నారు.

ఇక కోవిడ్ -19 వ్యాక్సిన్ అందరూ తీసుకునేలా ప్రజలను ఆయన ప్రోత్సహించాడు, అదేవిధంగా ఎటువంటి పుకార్లు నమ్మొద్దని ఆయన ప్రజలను ఈ సందర్భంగా కోరారు, ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

August 5th : ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెగాసస్ వ్యవహారంపై పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్షాలపై మోడీ గుప్పించారు.

టోక్యో ఒలింపిక్స్ లో మన భారత్ హాకీ టీం కాంస్య పతకం గెలిచిన విషయాన్ని మాట్లాడుతూ హాకీ లో మన వాళ్ళు గోల్స్ చేస్తుంటే అందరూ పండగల జరుపుకున్నారని కానీ కొందరు మాత్రం సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నరని విపక్షాల నుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు.

Olympics Tokyo

ప్రతిపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి, దేశాభివృద్ధి అడ్డుకునేందుకు ప్రయత్నించిన, అలాంటి రాజకీయ స్వార్ధపరులకు దేశం లొ తావు లేదు అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తానని నెగిటివ్ ప్రజలు దేశపురోగతి అడ్డుకోలేరని, 41 ఏళ్ల తర్వాత మన భారతదేశం హాకీ టీం టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెలిచిందని తెలిపారు సరికొత్త భారత్ తయరవుతుంది అని అన్నారు.

ఇది కూడా చదవండి : పుష్యమి నక్షత్రం వంద ఏళ్లకు ఒకసారి జరిగే మహా అధ్బుతం.