Aadhar Card : ఆధార్ కార్డ్ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పనిచేస్తుందా? ఒకవేళ వ్యక్తి మరణిస్తే ఆధార్ కార్డును ఏం మీకు చేయాలో తెలుసా?
భారతదేశ ప్రభుత్వం భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి పన్నెండు(12) అంకెల గల విశిష్ట గుర్తింపు కార్డును జారీ చేస్తుంది, అదే ఆధార్ కార్డ్.
ఈ ఆధార్ (Aadhar) కార్డు లో ఆ వ్యక్తికి సంబంధించిన వేలిముద్రలు మరియు అతని యొక్క వ్యక్తిగత వివరాలు అన్ని పొందుపరిచి ఉంటాయి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ.
అయితే అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర కార్యకలాపాల నిర్వహణకు ఆధార్ (Aadhar) కార్డు తప్పనిసరిగా కావాలి ఇదంతా బాగానే ఉంది కానీ ఇది ఆ వ్యక్తి బతికున్నంత వరకు పనిచేస్తుంది. మరి ఆ వ్యక్తి చనిపోతే ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుంది, దాన్ని ఏం చేయాలి అని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి.
మరణించిన లేదా చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ (Aadhar) కార్డు రద్దు చేసే రూల్ ఇప్పటివరకు భారతదేశ ప్రభుత్వం తీసుకు రాలేదు, అలాగని మరణించిన వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ని ఇంకొక వ్యక్తికి కేటాయిస్తారా అంటే అది కూడా లేదు.
ఎందుకంటే ఆ నెంబర్ పైన మరణించిన వ్యక్తి యొక్క వేలిముద్రలు మరియు ఇతర సమాచారం అంతా ఉంటుంది కదా. కాబట్టి అదంతా సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయం మీద కేంద్ర ఐటి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో ఇలా సమాధానమిచ్చారు.
“చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు అధికారులకు అప్పగించాలని ముందు ముందుగా కొత్త నిబంధనలు తీసుకొస్తామని ఆయన తెలిపారు త్వరలో కొత్త పద్ధతి ప్రకారం ఏ వ్యక్తి అయినా చనిపోతే అతనికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ పొందేందుకు దరఖాస్తు చేసే సమయంలో అతని యొక్క ఆధార్ కార్డు జనన మరణ శాఖ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు”.
అనంతరం మరణించిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డును యుఐడీఏఐ రద్దు చేస్తుంది, ఈ కొత్త రూల్స్ అమలు పరిచే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ అండ్ డెత్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది(1969) కి సవరణలు చేయనున్నారు.
ఇక మరణించిన వ్యక్తికి సంబంధించిన అతని పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ లాంటి ఎటువంటి వస్తే ధ్రువపత్రాల విషయానికి వస్తే వాటికి ఇప్పటి వరకే కొన్ని రూల్స్ ఉన్నాయి.
పాన్ కార్డ్ విషయానికి వస్తే ఆ వ్యక్తి మరణించిన సందర్భంలో దానిని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో సబ్మిట్ చేయాలన్న నిబంధన ఉన్నది మరియు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ సంబంధించి అందులో ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే అవి ఫోర్స్ లో ఉంటాయి, తర్వాత అవి రెన్యువల్ చేసుకోకపోతే అవి వాటంతట అవే అయిపోతాయి.