Ekalavya : ఏకలవ్యుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు, ఏకలవ్యుడు కి కృష్ణుడికి మధ్య వైరం ఎందుకు వచ్చింది.
ఏకలవ్యుడు (Ekalavya) మహాభారతంలో ఒక గొప్ప యోధుడు, అతనికి గొప్ప చరిత్ర ఉంది. అతని గాథ ఇప్పటికీ చాలా మందికి ఆదర్శం. గాండీవదారి అయ్యి కురుక్షేత్ర యుద్ధాన్ని తన విలువిద్య ప్రభంజనంతో శాసించిన అర్జునుడి నే మించిన వాడిని గా చరిత్ర పుటలలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఏకలవ్యుని గురించి చాలా విషయాలు నేటి తరం వారికి తెలియదు.
ఇంతకీ అసలు ఏకలవ్యుడు (Ekalavya) ఎవరు? ద్రోణాచార్యుడు ఏకలవ్యుని ఎందుకు శిష్యుడుగా తిరస్కరించాడు? అతను అంతటి విలువిద్య ఎలా సాధించాడు? తన బొటనవేలు ద్రోణాచార్యుని కి ఇవ్వడానికి గల అసలైన కారణం ఏమిటి? ఆ తర్వాత ఏకలవ్యుడు ఏమైపోయారు? అతనికి కృష్ణుడికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏకలవ్యుడి (Ekalavya) గురించి తెలియాలి అంటే ఒకసారి మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏకలవ్యుడు నిషాద కులంలో హిరణ్యధన్యుడు, సులేఖ అనే దంపతులకు జన్మించాడు, నిషాద కులస్తులను ఈ కాలంలో ఎరుకల వారిగా గా, బోయ వారి గా పిలుస్తున్నారు.
వీరు ప్రధానంగా అడవిలో జీవిస్తూ అక్కడే ఆకులూ, అలములూ, దుంపలను తింటూ వన్యప్రాణులను వేటాడే జీవనం సాగిస్తారు. వీరి ఆహారంలో అధిక భాగం జంతువుల వేట వల్లనే వస్తుంది, అందువల్ల ఈ కులం వారు విలువిద్యలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు.
ఈ నిషాద కులానికి రాజు ఏకలవ్యుడి తండ్రి అయిన హిరణ్యధన్యుడు, తొలుత ఏకలవ్యుడు తన తండ్రి వద్దనే విద్య నేర్చుకున్నాడు అయితే హిరణ్యధన్యుడు జరాసంధుడి వద్ద సామంత రాజుగా ఉండేవాడు దానివల్ల జరాసంధుడు చేసే యుద్దాలలో పాల్గొని ఒక దానిలో వీరమరణం పొందాడు. తండ్రి మరణించడం వల్ల ఏకలవ్యుడు (Ekalavya) వారి తెగకు చిన్న వయసులోనే రాజయ్యాడు.
అయితే తండ్రికి ఉన్న బుద్ధి కుశలం, వేటకి వెళ్ళినప్పుడు అడవి మృగాలు నుంచి తన వారిని కాపాడుకునే అంత నేర్పరితనం, విద్య అంత చిన్న వయసులో ఏకలవ్యుడు వద్ద లేకపోవడం వల్ల తనకి సకల విద్యలు నేర్పగల గురువు గురించి వెతుకుతున్న సకల విద్యా పారంగతుడు విలువిద్యలో ఎదురులేని పరాక్రమశీలి అయిన ద్రోణాచార్యులు గురించి తెలుసుకొని అయన వద్దకి వెళ్లి తనకి కూడా సకల శాస్త్ర విద్యలను నేర్పమని అడిగాడు.
ఏకలవ్యుడి (Ekalavya) కోరికను ద్రోణాచార్యుడు తిరస్కరించాడు, ఆ తిరస్కారానికి కారణం అడగగా నేను కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాను, నీవు నిషాధ తెగకు చెందిన వాడవు, కాబట్టి నీకు నేర్పలేను అని బయటకు చెప్పిన ద్రోణుడు, ఏకలవ్యుడి ప్రవర్తనలో ఏదో దోషం కనిపించింది అందువల్లనే ఆ క్షణంలో ద్రోణుడు ఏకలవ్యుడు నేర్పించడానికి సుముఖత చూపించలేదు.
ద్రోణుడి శాస్త్ర విద్య కౌశలానికి ముగ్ధుడయిన ఏకలవ్యుడు ద్రోణుడినే తన గురువుగా భావించి అడవిలో బంకమట్టితో ఆయన విగ్రహం ఒకటి చేసుకుని ని ఆ బొమ్మే తనకు విద్య నేర్పుతుందని భావించి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు.
ఇది ఇలా ఉండగా ఒకరోజు ద్రోణుడు కురు పాండవులను పిలిచి అడవిలోకి వెళ్లి సరదాగా వేటాడమని , వేట నే క్షత్రియులకు ఆటవిడుపు అని చెప్పి పంపాడు.
అయితే అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు పరిగెత్తే అడవి జంతువులను బాణంతో గురిచూసి కొట్టడం వల్ల వారి విలువిద్య నైపుణ్యం పెరుగుతుందని అనేది ఇక్కడ ఆయన ఉద్దేశ్యం, ఆయన మాటే పరమావధిగా కురుపాండవులు కొంతమంది సైన్యంతో వేట కుక్కలతో అడవిలోకి వేటకి వెళ్లగా అడవిలోనే ఒకచోట విలువిద్య సాధన చేసుకుంటున్న ఏకలవ్యుని (Ekalavya) మరియు వింత ఆకారాన్ని చూసి ఒక కుక్క మొరగడం మొదలుపెడుతుంది.
తనను చూసి మొరుగుతుంది కోపంతో ఆ కుక్క తెరిచిన నూరు మూసుకుని లోపు ఏడు బాణాలను ఏకకాలంలో సంధించి దాని నోరు కదపకుండా చేశాడు, దానితో కుక్క మూలుగుతూ కురుపాండవుల వద్దకు రాగా ఆ కుక్కకు పట్టిన గతి కి కారణం ఏంటో అన్వేషిస్తూ దానితోపాటు వెళ్ళిన భటుడి ని అక్కడ జరిగిన వృత్తాంతాన్ని ద్రోణుని మట్టి బొమ్మ ని గురించి చెప్పాడు.
అప్పటివరకు విలువిద్యలో అత్యంత పరాక్రమశాలి అయిన అర్జునుడు ఏక కాలంలో ఐదు బాణాలను మాత్రమే స్పందించగలరు, కానీ ఏకలవ్యుడు (Ekalavya) ఏడు బాణాలను స్పందించడంతో అక్కడి వారు ఆశ్చర్య పోవడం తో పాటు కౌరవులు అర్జునుడిని హేళన చేశారు.
దాంతో అర్జునుడు ద్రోణుడి వద్దకు వెళ్లి అడవిలో జరిగిన వృత్తాంతాన్ని వివరించి అదే సమయంలో ద్రోణుడు ఒక నాడు ప్రపంచంలో నీకంటే సమర్థుడైన విలుకాడు ఉండనంత విధంగా విలువిద్య నేర్పుతానని అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తు చేసాడు.
దానితో ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు తాను ఎవరికీ అంతటి విద్యను నేర్పిలేదని, అయినా తన పేరుతో అంత విద్యను నేర్చుకున్నా వ్యక్తిని చూడాలని నిశ్చయించుకొని ద్రోణుడు ఏకలవ్యుని (Ekalavya) దగ్గరికి వెళ్ళాడు, తాను వెళ్లేముందు కుక్కకు జరిగిన దుస్థితిని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు, ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు సంతోషపడి ద్రోణుడికి సన్మానం చేసి తన భక్తిని చూపెట్టాడు.
అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని తో ‘ఏకలవ్య నీవు నేనే నీ గురువు అని చెబుతున్నావు కదా, మరి నా గురుదక్షిణ ఏది అని అడగగా దానికి ఏకలవ్యుడు తప్పకుండా గురువర్యా నా సంపద కాని నా దేహ ప్రాణాల లో ఏది కావాలన్నా చెప్పండి అంటాడు.
అది మీకు వెంటనే సమర్పించుకుంటాను అని పలికాడు, అప్పుడు ద్రోణుడు వెంటనే నీ కుడి చేతి బొటన వేలుని ఇవ్వమని అడగగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బొటన వేలుని కోసి గురుదక్షిణగా ద్రోణాచార్యుని కి ఇచ్చాడు ఏకలవ్యుడు’.
ద్రోణుడు చేసిన ఈ పనికి భాగవతంలో ఒక వివరణ కూడా ఇచ్చారు, ఏకలవ్యుడు ఎంత గొప్పవాడైనా కాలక్రమంలో అధర్మం వైపు నిలబడి యుద్ధం చేయడం వల్ల ఎంతో అనర్థం జరుగుతుందని భావించిన ద్రోణుడు విలువిద్య కి ఆయువు పట్టు అయిన బొటనవేలును ఇవ్వమని కోరినట్లు భాగవతం చెబుతుంది.
బొటనవేలు పోయినా ఏకలవ్యుడు మిగిలిన నాలుగు వేళ్ళతో బాణాలను సంధించడం లో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు, అయితే ద్రోణుడు అనుకున్నది నిజం అయినది ఏకలవ్యుడు ధర్మం వైపు మొగ్గు చూపకుండా అధర్మం వైపు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, ఏకలవ్యుడు జరాసంధునికి మద్దతుగా నిలిచాడు.
జరాసంధునికి ఏకలవ్యుని శక్తిసామర్థ్యాలు మీద అపార నమ్మకం అయితే జరాసంధునికి శ్రీకృష్ణునికి ఉన్న వైరం వల్ల జరాసంధుడు చాలాసార్లు కృష్ణుని మీదకి సేనలను పంపాడు కానీ ఏనాడు గెలవలేక పోయాడు ఆ సమయంలో సకల శాస్త్ర విద్య పారంగతుడు అయిన ఏకలవ్యుడిని శ్రీకృష్ణుడి సేనలపై కి పంపాడు.
ఏకలవ్యుడి ధనుర్విద్య నైపుణ్యానికి యాదవ సేనలు పిట్టలు రాలినట్టుగా రలి పోతుంటే అది తెలుసుకున్న కృష్ణుడు తానే స్వయంగా కదన రంగం లోకి వచ్చి ఏకలవ్యుడిని మట్టు పెట్టాడు, అంతటితో ఒక మహావీరుని అధ్యాయం ముగిసింది.
ద్రోణుడు కాదన్నా పట్టుదలతో గురువు లేకుండా అపార విలువిద్య నేర్చుకొని పట్టుదల గల వ్యక్తిగా ద్రోణుడు అడిగిన వెంటనే క్షనమయిన ఆలోచించకుండా తన బొటన వేలుని కోసి ఇచ్చి గురు భక్తిని చాటి చాటుకున్న వ్యక్తిగా మహా వీరుడిగా పేరుగాంచిన ఏకలవ్యుడు ధర్మ అధర్మ విచక్షణ లేక అధర్మం వైపు మొగ్గు చూపి చూపడం వల్ల ఆఖరికి కృష్ణుడి చేతిలో మరణించక తప్పదు తప్పలేదు.