Negative Energy : చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవాలి అని ఉంటుంది, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే శ్రీవిద్య ఉపాసన ప్రకారం ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి?
చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ (Negative Energy) ఉందో లేదో తెలుసుకోవాలి అని ఉంటుంది, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే శ్రీవిద్య ఉపాసన ప్రకారం ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి? ఉంటే కనుక మన ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏమి చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
నెగిటివ్ ఎనర్జీ (Negative Energy) అనగ తామసిక శక్తి. అది ఉందో లేదో తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. ఒక సస్థంగానికి వెళ్ళిన, ఒక పార్టీ కి వెళ్ళినా, ఒక పూజ కి వెళ్ళినా, గుడి కి వెళ్ళినా సరే ఇంటికి రావడానికి మనకి నీరసంగా అనిపిస్తే అబ్భా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలా అని ఒక ఉత్సాహం లెని అటువంటి స్థితి ఉంటే కొంత నెగిటివ్ ఎనర్జీ (Negative Energy) ఉందని భావించాలి.
సాధారణంగా ఒక కొత్త ఇంటికి వెళ్ళాం అంటే ఆ ఇంట్లో అంతకు ముందు వసించిన వాళ్ళు ఒకవేళ వసించి ఉంటే లేదా ఆ స్థానంలో ఇంతకు ముందు ఏదైనా ఒక శ్మశానం లాంటిది కానీ, మరి అలాంటిది ఉండి మనకు తెలియకుండా దాని మీద ప్లాట్లు వేసి కట్టుకుంటే ఇటువంటి వాటి వల్ల కొంతవరకు అంతకు ముందే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.
దీనికి తోడు మనం సాత్వికంగా ఉండాలి కానీ కుదరదు, ఇంట్లో అరుస్తూ ఉంటాం. దీనివల్ల కేకలు పెట్టినపుడు ఈ శబ్ధ తరంగాలు వాయు మండలాన్ని కలుషితం చేస్తాయి.
ఆ కలుషిత మయిన వాయు మండలంలో మళ్ళీ వీళ్ళు అక్కడే ఉండడం చేత అవి రెండు కలిసి ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ తయారు అవుతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగం లో ప్రతి ఇంట్లో జరిగే ఈ సమస్య ఇది. ఇది రకరకాలుగా ఉంటుంది.
ప్రాథమిక దశలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు ఉన్నప్పుడు, మనశాంతి కరువు గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని, సాయంకాలం పూట అనగా అసుర సంధ్య వేళ అనగా సూర్యాస్తమయానికి ఒక అర గంట ముందు సాంబ్రాణి వేసి చేతిలో గంట వాయిస్తూ ధూపాన్ని ప్రతి గదిలోకి చూపించాలి.
ఒక ఇండివిడ్యువల్ హౌస్ ఉన్నప్పుడు ఇంటి చుట్టూరా వెళ్లగలిగే అవకాశం ఉంటే ఇంటి చుట్టూ కూడా గుమ్మడికాయ పట్టుకొని మూడుసార్లు ప్రదక్షిణం చేయాలి, చేస్తూ ఉన్నప్పుడు ఒక మంత్రం పాటించాలి అది
ఓం హ్రీం సర్వ విఘ్న క్రిభ్యో
సర్వభూతేభ్యో హుమ్ ఫట్ స్వాహా
అనే చిన్న మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్ర అర్థం ఏమిటంటే
ఓం అనగా ప్రణవం, సర్వ అనగా అన్ని, విఘ్న అనగా నాకు కలిగించే విజ్ఞాలన్నీ, క్రిభ్యో అనగా చేసేటటువంటి, సర్వ అనగా అన్ని, భూతేభ్యో అనగా భూతములు, హుమ్ ఫట్ అన్నది మారణ దేయం, స్వాహా అనగా తొలగిపోవు గాక అని అర్థం, నా మనశ్శాంతికి అడ్డంగా ఉన్న శక్తులన్నీ నాశనం అవు గాక అన్నది అర్థం.