ZOMATO Pro Plue : జొమాటో ప్రో ప్లస్ పేరుతో కొత్త ప్లాన్ ను ప్రారంభించింది, ఇది అందరికి ఇన్వైట్ ఓన్లీగా ప్రారంభించారు.
ఇటీవలే IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ) తో చెలరేగిపోయిన ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, ఇంకొక కొత్త మెంబర్షిప్ ప్లాన్ ను ప్రవేశపెట్టబోతుంది, దీని భాగం లో అన్లిమిటెడ్ ఫ్రీ డెలివరీ, నో సర్జ్ ఫీ మరియు నో డిస్టెన్స్ ఫీ అంటూ కొత్త కొత్త ఆఫర్ ల ను ప్రవేశపెట్టబోతుంది.
ఈ కొత్త మెంబర్షిప్ కు జొమాటో ప్రో ప్లస్ (ZOMATO Pro Plue) అనే పేరు పెట్టారు.
జొమాటో సిఈఓ (CEO) అయిన దీపిందర్ గోయల్ తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ మెంబర్షిప్ ప్లాన్ ను కొంత కాలం పాటు మాత్రమే కొంతమందికి మాత్రమే అందిస్తున్నట్లు తెలియచేసారు.
జొమాటో ఆన్లైన్ , డైనింగ్ మీద రాయితీ లతో పాటు , ఉచితంగా డెలివరీ సేవలను అందిస్తోంది. ఈ జొమాటో ప్లాన్ కోసం తొంబై రోజులకు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
అదే విధంగా ఇప్పుడు జొమాటో ప్రో ప్లస్ (ZOMATO Pro Plue) కూడా ఉండేలా తీసుకువస్తున్నట్లు జొమాటో సిఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు.
అయితే , జొమాటో ప్రో ప్లస్ (ZOMATO Pro Plue) ప్లాన్ కు సబ్స్క్రైబ్ అయ్యేందుకు ఎంపిక చేసిన కస్టమర్ లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అని తెలిపారు.
ఆగస్ట్ రెండు సాయంత్రం ఆరు గంటల తరువాత జొమాటో యాప్ ను ఓపెన్ చేసినపుడు, ఒకవేళ మీరు ఇన్వైట్ అయి ఉంటే మీరు జొమాటో ప్రో ప్లస్ కొత్త ప్లాన్ కు సబ్స్క్రైబ్ అవవచ్చు. జొమాటో సిఈఓ దీపిందర్ గోయల్ జొమాటో ప్రో ప్లస్ ప్లాన్ కు ఎంత చెల్లించాలో తెలపలేదు.
ప్రస్తుతం జొమాటో ఎడిషన్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆటోమేటిక్ గా జొమాటో ప్రో ప్లస్ (ZOMATO Pro Plue) ప్లాన్ కు అప్గ్రేడ్ అవుతారని గోయల్ తెలిపారు.