Hockey Olympics : భారత మహిళల హకీ జట్టు 41 ఏళ్ళ తరువాత ఒలంపిక్స్ లో హకీ లో తొలిసారి సెమీస్ కు చేరింది. గత సంవత్సరం లో ఒలంపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, జట్టు పన్నెండవ స్థానంలో నిలిచారు.
టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత మహిళల హకీ (Hockey) జట్టు దుమ్ము రేపింది. ఆస్ట్రేలియా పైన 1-0 తేడా తో గెలిచిన మహిళల హకీ (Hockey) జట్టు సెమీస్ కు చేరింది. 41 ఏళ్ళ తరువాత ఒలంపిక్స్ లో హకీ లో తొలిసారి సెమీస్ కు చేరింది.
గత సంవత్సరం లో ఒలంపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, జట్టు పన్నెండవ స్థానంలో నిలిచారు.
అందువల్ల ఎవరికి కూడా మహిళల హకీ (Hockey) జట్టు మీద గెలుస్తారని అంచనాలు లేవు కానీ అందరి అంచనాలను బద్దలు కొడుతూ మహిళల హకీ జట్టు 41 ఏళ్ళ తరువాత ఒలంపిక్స్ లో హకీ లో తొలిసారి సెమీస్ కు చేరుకుని ఒక చరిత్ర తిరగరాశారు, ఇదే ఆట తీరుతో ముందుకు వెళితే భారత్ కు మరో పతకం ఖాయం.
క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలంపిక్స్ విజేతలయిన ఆస్ట్రేలియా జట్టు పైన గెలిచి సగర్వంగా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది, సుధీర్ఘ విరామం తరువాత హకీ జట్టు సెమీస్ కు చేరుకుంది.
పతకం సాధించాలనే పట్టుదలతో మైదానం లో పాదరసం ల కదులుతూ సూపర్ విక్టరీ సాధించారు మహిళలు, ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.
1980 వ సంవత్సరం లో మాస్కో లో జరిగిన ఒలంపిక్స్ తరువాత ఇప్పుడు భారత్ అత్యుత్తమ ఆటను కనబరిచింది,ఇక గుర్జీత్ కౌర్ ఈ మ్యాచ్ లో భారత్ కు తొలి ఏకైక గోల్ చేసి ప్రత్యేకం ఆకర్షణ గా నిలిచారు.
బలమయిన జట్టు గా పేరున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్క్రమించింది.
ఇక క్వార్టర్స్ కు ముందు పూల్ ఎ లో భాగంగా భారత్ లీగ్ దశ లో రెండు మ్యాచ్ లలో గెలిచి మూడింటిలో ఓడింది.
ఏడు గోల్స్ చేసి పద్నాలుగు గోల్స్ సమర్పించుకుంది, మరో వైపు పూల్ బి లో భాగంగా ఆస్ట్రేలియా ఆడిన అయిదు మ్యాచ్ లలోనూ గెలిచింది.