YouWeCan : సేవా కార్యక్రమాలలో క్రికెటర్ యువరాజ్‌సింగ్

YouWeCan
YouWeCan : యువరాజ్‌సింగ్ డ్యాషింగ్ బ్యాట్స్‌మ్యాన్ గా ఎంతో మంది మనసు దోచుకున్నాడు. ఆరు బంతులలో ఆరు కొట్టిన సంధర్భాలని ఎవరూ మరువ లేదు

యువరాజ్‌సింగ్ డ్యాషింగ్ బ్యాట్స్‌మ్యాన్ గా ఎంతో మంది మనసు దోచుకున్నాడు. ఆరు బంతులలో ఆరు కొట్టిన సంధర్భాలని ఎవరూ మరువ లేదు, క్యాన్సర్ ను జయించాడు. అలాంటి యువరాజ్ ఇప్పుడు యూవికెన్ (YouWeCan) ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.

ప్రస్తుత కరోనా క్లిష్ట సమయం లో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సీమీటర్ నుంచి ఐసియూ బెడ్స్ వరకు అన్నీ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాడు.

ఎంతో మందికి సౌకర్యాలను కల్పిస్తున్నారు యువరాజ్‌సింగ్, అయితే ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో చేయించేందుకు చొరవ చూపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

YouWeCan

యూవికెన్ (YouWeCan) ఫౌండేషన్ ప్రతినిధులతొ పలుమార్లు చర్చలు జరిపారు. యువరాజ్‌సింగ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకురావడం లో కవిత విజయం సాధించారు.

జనరల్ ఆసుపత్రిలో యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండున్నర కోట్ల వ్యయంతో నూట ఇరువై క్రిటికల్ కేర్ యూనిట్స్ ఏర్పాటు చేసారు. నగరం లో ఇంతలా చేసిన క్రికెటర్ యువరాజ్‌సింగ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆ నగర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

యూవికెన్ (YouWeCan) ఫౌండేషన్ వెబ్ సైట్ :  YouWecan.org

యూవికెన్ (YouWeCan) ఫౌండేషన్ వారు మిషన్ తౌజెండ్ అనే మహత్తరమయిన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీనిలో భాగంగా ప్రతి ఒక్క ఆసుపత్రిలో బెడ్ ల సామర్థ్యం ను పెంచడం. నిరుపేదలకు మంచి వైద్యం అందివ్వాలనే ఉద్దేశం తో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులను వారు ఎన్నుకోవడం జరిగింది.

YouWeCan

యూవికెన్ (YouWeCan) ఫౌండేషన్ సంస్థ భారత్ లో చేసిన వాటిలో నిజామాబాద్ కు చేస్తున్న ఈ సహకారం చాలా ఉపయోగకరంగా మారింది. పద్దెనిమిది టాప్ ఎండ్ వెంటిలేటర్‌లను కూడా యూవికెన్ ఫౌండేషన్ సంస్థ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అందించింది.

ఇండియాలోనే అతిపెద్ద ఐసియూ కేర్ సెంటర్‌గా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ని వారు ఎన్నుకున్నారు. దానిలో భాగంగా 120 ఐసియూ బెడ్స్ తో పాటు, 120 మల్టీ చానెల్ మానిటర్స్, 18 వెంటిలేటర్స్, కంటిన్యుయస్ పాజిటివ్ ఏర్‌వే ప్రెస్సర్ మెషన్స్, బైప్యాప్ మిషన్స్ ఇవన్ని యూవికెన్ ఫౌండేషన్ సంస్థ వారు సమకూర్చారు. వాటికి దాదాపు రెండు నుండి మూడు కోట్ల ఖర్చు అయ్యి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.

120 ఐసియూ బెడ్స్ విత్ ఆల్ ఎక్విప్‌మెంట్స్ తో కార్పోరేట్ ఆసుపత్రులని తలదన్నేలా మారిపోయింది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి. రాబోయే రోజుల్లో ఎంతో మందికి రోగులకు ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : దళిత బంధు కోసం 500 కోట్లు విడుదల