Tejas Aircraft 2021: “తేజస్” యుద్ధ విమాన తయారి ఇక్కడే – హైదరాబాద్

Tejas Aircraft
Tejas Aircraft :  “తేజస్” తయారీలో ముఖ్యమయిన మధ్య భాగం సెంటర్ ఫ్యూస్‌లేజ్ ను హైదరాబాద్ లోని వీఈఎం (VEM) టెక్నాలజీస్ సంస్థ విజయవంతంగా తయారు చేసారు.

డిఫెన్స్ రీసర్చ్ ప్రొడక్షన్ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానం తో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం “తేజస్” (Tejas Aircraft) తయారీలో ముఖ్యమయిన మధ్య భాగం సెంటర్ ఫ్యూస్‌లేజ్ ను హైదరాబాద్ లోని వీఈఎం టెక్నాలజీస్ సంస్థ విజయవంతంగా తయారు చేసారు.

జులై 26 న వీఈఎం టెక్నాలజీస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు “తేజస్” (Tejas Aircraft) ముఖ్యమయిన మధ్య భాగాన్ని అందించారు.

Tejas Aircraft

హైదరాబాద్ లోని వీఈఎం టెక్నాలజీస్ సంస్థ మొట్ట మొదటిసారి యుద్ధ విమానాలకి వెన్నెముక లాంటి మద్య భాగాన్ని సెంటర్ ఫ్యూస్‌లేజ్ ను తేజస్ లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తో ఉత్పత్తి భాగస్వామి గా కలిసి తయారు చేసారు.

దేశ ప్రధాన మంత్రి ఆత్మ నిర్బర్ భారత్ అన్నట్లు బయట దేశాల నుండి ఉత్పత్తి చేసుకోవడం తగ్గించి సొంతంగా చేసుకోవడం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ వీఈఎం టెక్నాలజీస్ లాంటి ఎన్నో కంపెనీస్ ను ప్రోత్సహిస్తున్నారు.

Tejas Aircraft

హైదరాబాద్ నుంచి వీఈఎం టెక్నాలజీస్ వల్ల డిఫెన్స్ రీసర్చ్ ప్రొడక్షన్ లో హైదరాబాద్ ఒక స్థాయి ముందుకెళ్ళింది.

గత రెండు దశాబ్దాల నుంచి వీఈఎం టెక్నాలజీస్ ,హెచ్ఏఎల్ కు ఉత్పత్తి భాగస్వాములుగా ఉంటున్నారు.కాని ఎల్ఏసి లో మధ్యభాగం ను తయారు చేయడం మొదటిసారి.

Tejas Aircraft

తేజస్ మద్య భాగం తయారీకి దాదాపు 5వేలకు పైగా హెచ్ఏఎల్ లో శిక్షణ పొందిన ముప్పై మంది ఇంజనీర్‌లు మరో ఇరవై మంది సాంకేతిక సిబ్బంది యేడాది పాటు శ్రమించి రూపొందించారు.

మద్య భాగాన్ని తయారు చేయడానికి పదిహేను వందల తొంబై అయిదు విడి భాగాలను కూర్చాల్సి ఇంటుంది. అన్ని విభాగాలుగా చేసుకోని ప్రత్యేకంగా డిజైన్ చేసిన అసెంబుల్ చేసి మధ్య భాగాన్ని రూపొందించుతారు.

ఇది కూడా చదవండి : నయనతార – ఓటీటీ లో సంచలనం