సినిమా

Disney Plus Hotstar 2021: నయనతార – ఓటీటీ లో సంచలనం

Disney + Hotstar
Disney Plus Hotstar :  కరోనా సెకండ్‌వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు వాయిదా పడుతూ వచ్చాయి. దీనితో భారీ చిత్రాలని నిర్మించిన మేకర్స్ OTT లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు

కరోనా సెకండ్‌వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు వాయిదా పడుతూ వచ్చాయి. దీనితో భారీ చిత్రాలని నిర్మించిన మేకర్స్ సందేహం లో పడ్డారు.

తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత ముఖ్యమో ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. కావడం తో విడుదల విషయం లో నిర్మాతలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొత్త కంటెంట్,యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్‌ఫుల్ గా దూసుకు పోతున్నాయి ఈ ఓటీటీ సంస్థలు. దీనితో తమ చిత్రాలకు ఓటీటీ నుంచి మంచి ధర వస్తే అక్కడే రిలీజు చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైం వీడియో లొ విడుదలై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.

Disney + Hotstar

తాజాగా ఓ లేడీ సూపర్‌స్టార్ సినిమా ఓటీటీ బాట పట్టింది. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిలిం “నెట్రికన్” ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీ హాట్‌స్టార్ లో విడుదల కానుంది.

ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) అఫిష్యియల్ గా ప్రకటించింది. కాని రిలీజు ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు.

ఈ చిత్రానికి మిలింద్‌రావ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రోడ్డు ప్రమాదం లో చూపు కోల్పోయే యువతి పాత్రలో నయనతార కనిపించారు.

కొరన్ థ్రిల్లర్ బ్లైండ్ చిత్రాని “నెట్రికన్” రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నయన్ చిత్రాలు ఓటీటీ లో విడుదల అయి ఈ సినిమాకు మంచి హైప్‌కు కారణమయ్యాయి.

ఇక ప్రస్తుతం నయన్ తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇది కూడా చదవండి : గురుపూర్ణిమ -విశిష్టత