Guru Purnima 2021 : గురుపూర్ణిమ -విశిష్టత

guru purnima
Guru Purnima : ఆషాడ శుద్ధ పౌర్ణమి వ్యాస మహర్షుల వారు పుట్టిన రోజు. గురువులందరిలోనూ ఆయనది గురు స్థానం, అందుకే గురుపూర్ణిమ రోజున గురువలను పూజించుట ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం.

“వ్యాసం విశిష్ట నప్తారం
శక్తే పౌత్రమ కల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపో నిధిం .
వ్యాసాయ విష్ణు రూపాయా వ్యాస రూపాయా విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయా నమః”

వ్యాస మునీద్రుడు శ్రీ మహా విష్ణు స్వరూపుడు, మునీనాం అహం వ్యాసః అంటే మునులలో వ్యాసున్ని నేనే అని భగవత్గీతలో శ్రీ మహా విష్ణువు స్వయంగా చెప్పాడు. అదీ వ్యాసుల వారి గొప్పతనం. ఆషాడ శుద్ధ పౌర్ణమి వ్యాస మహర్షుల వారు పుట్టిన రోజు. గురువులందరిలోనూ ఆయనది గురు స్థానం, అందుకే గురుపూర్ణిమ (Guru Purnima) రోజున గురువలను పూజించుట ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం.

Guru Purnima

ఎక్కువ కాలం బదరీకాశ్రమం లో తపస్సు చేయడం వల్ల వ్యాసుల వారిని బాదరాయణుడు అని కూడా అంటారు.

త్రిమూర్తుల కార్యకలాపాలను నిర్వర్తించిన ప్రతిభా వంతుడు , త్రిమూర్తి స్వరూపుడు అగుట చేత వ్యాస భగవానుడిగా పిలవబడే వ్యాసుడి పుట్టు పూర్వోత్తరాలేంటో తెలుసుకోండి.

వ్యాసుడు వశిష్టుడి మనవడు. పరాశరా మునీంద్రునికి , సత్యవతికి యమునా నది తీరాన క్రిష్ణ ద్వీపం లో జన్మించాడు. అందువల్ల ఆయనని క్రిష్ణ ద్వైపాయనుడు అంటారు. ఈయన కుమారుడు శుఖయోగి. వ్యాస మహర్షి మానవ లోకానికి లోక కళ్యాణానికి చేసిన మేలు మాటల్లో చెప్పలేం.

భారతీయ ఆర్ష వాంగ్మయం లో ప్రధానమయిన వేదాలను నాలుగు భాగాలుగా విభంజించారు. పంచమ వేదం అయిన మహాభారత ఇతిహాసాన్ని రచించారు. శ్రీ క్రిష్ణావతార కథా మూలమయిన శ్రీమగ్భావతాన్ని, అష్టాదశ పురాణాన్ని వేదాలను వ్యాసుల వారు లోకానికి అనుగ్రహించారు.

Guru Purnima

మన ప్రాచీన విజ్ఞానం అంతా వ్యాసుని నుంచే వెలువడింది. అందుకే వ్యాసోచ్చిశ్టం జగత్ సర్వం అన్నారు. వ్యాసుని ముఖ కమలం నుండి జాలువారిన జ్ఞానోమృతాన్ని అనాది నుంచి ఈనాటి వరకు ప్రపంచం అంతా ఆస్వాదిస్తుంది. భవిష్యత్తు తరాలకు అందిస్తుంది. అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతితో దారి ని చూపే వాడే గురువు.

దేవ లోకానికి బృహస్పతి , అసుర లోకానికి శుక్రాచార్యుడు గురువులు. అలాగే త్రేతా యుగం లో శ్రీరాముడికి విశ్వామిత్రుడు, ద్వాపర యుగం లో శ్రీక్రిష్ణ బలరాములకు సాందీప ముని గురువులు అయితే సకల మానవ లోకనికి గురువు వ్యాస మహర్షి.

గురువును (Guru Purnima) పూజించడం అనాది నుంచి వస్తున్న సంప్రదాయం. గురువు అనుగ్రహం పొందిన వారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు. గురువు అనుగ్రహం లేకపొతే మానవ మాత్రునికి ఏదీ సిద్దించదు.

guru purnima

మన సనాతన సంప్రదాయం గురువును అత్యున్నత స్థానం లో నిలిపింది. అందుకే పరమ పవిత్రమయిన ఆశాడ శుద్ధ (Guru Purnima) పొర్ణమి నాడు వ్యాస మహర్షులతో పాటు గురు దక్షిణామూర్తి , జగత్ గురు ఆది శంకారాచార్య , సద్గురుగా జనంచే పూజించబడుతున్న షిర్డీ సాయినాథుడిని కూడా విశేశంగా ఆరాధిస్తారు.

అలాగే మనకు విద్యను నేర్పిన గురువులను మనల్ని సన్మార్గం లో నడిపే మహానుభావుడులను భక్తి పూర్వకంగా స్మరించుకొని పూజించడం మన కర్తవ్యం. గురువు సన్నిధిలో గురువు అనుగ్రహం తో ప్రపంచం అంతా జ్ఞాన జ్యోతులు వెలగాలని, జనులంతా ధర్మ మార్గం లో నడవాలని ఆకాంక్షిద్దాం.

అఖండ మండలాకారం వ్యాప్తయే న చరాచరం
తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవే నమః.

ఇది కూడా చదవండి : ఒలంపిక్స్ – టోక్యో