Microsoft Windows 11 : విండోస్11 సరికొత్త ఫీచర్స్ తో మనముందుకు

Microsoft windows 11
Microsoft Windows 11: ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు పూర్తి భిన్నంగా తీసుకొచ్చిన కొత్త వెర్షన్ విండోస్ 11 లో అదిరిపోయే ఫీచర్స్ అందుబాటు లో ఉన్నాయి.

వినియోగదారులకు మరింత చేరువ కావడానికి,  మరింత సరళతరమైన డిజైన్ తో రూపొందించిన ఈ ఆపరేటింగ్ సిస్టం లో విండోస్ చరిత్రలోనే తొలిసారి ఆండ్రాయిడ్ యాప్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఆకర్షించే విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 (Microsoft Windows 11) ఉంటుంది అన్ని నిపుణుల సమాచారం .

హెచ్‌డిఆర్ నాణ్యతలో స్నేహితులు కుటుంబసభ్యులతో అనుసంధానం అయ్యేందుకు చాట్ టూల్  ను కొత్తగా తీసుకొచ్చింది, వర్చువల్ లర్నింగ్ మరియు గేమింగ్ లను దృష్టిలో పెట్టుకొని విండోస్ 11 (Microsoft Windows 11) ను రూపొందించారు.

ఎప్పుడప్పుడా అని విండోస్ ప్రియులు ఎదురుచూస్తున్న విండోస్11 అదిరిపోయే ఫీచర్స్ తో ముందుకు వచ్చింది, గురువారం వర్చువల్ గా జరిగిన కార్యక్రమం లో మైక్రో సాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను ఆవిష్కరించింది, 2015 లో విండోస్ 10 విడుదల తరువాత దాదాపు 6సం|| తరవాత మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ను విడుదల చేసింది.

విండోస్11 ఆవిష్కరణ సందర్భంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఈఓ సత్య నాదెళ్ళ విండోస్ చరిత్రలో దీనిని ఓ మైలు రాయిగా అభివర్ణించారు, రానున్న పదేళ్ళ వరకు వినియోగదారుల అవసరాలకు ఉపయోగపడే విధంగా విండోస్ 11 (Microsoft Windows 11)  ఉండపోతుంది అన్ని చెప్పారు.

విండోస్ లో మునుపెన్నడూ లేనంత స్మార్ట్ ఫీచర్స్‌ను మైక్రోసాఫ్ట్ విండోస్11 లో తీసుకొచ్చారు, మైక్రోసాఫ్ట్ విండోస్10 తో పోలిస్తే పూర్తిగా కొత్త లుక్ తో పరిచయం చేసారు.

Microsoft windows 11

మెను, టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్ ల విషయం లోను సరికొత్త అనుభూతులను వినియోగదారులు పొందేలా దీనిని రూపొందించారు, విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టం లతో సంబంధం లేకుండా స్నేహితులు కుటుంబసభ్యులతో టెక్స్ట్, వాయిస్ చాట్, వీడియో కాలింగ్ ద్వారా తక్షణమే అనుసంధానం కావొచ్చు, ఈ సౌకర్యాన్ని స్టార్ట్ మెనూ  టాస్క్ బార్ లో పొందుపరిచారు.

గేమింగ్ ప్రియులకు ఆకర్షించడానికి అదిరిపోయే గేమింగ్ అనుభవాన్ని మైక్రోసాఫ్ట్  విండోస్11 (Microsoft Windows 11) లో తీసుకొచ్చింది, క్షణాల్లో గేమ్ లోడ్ కావడం హెచ్‌డిఆర్ నాణ్యతలో గేమింగ్ అనుభవాన్ని పొందే సౌకర్యాన్ని కల్పించింది, అత్యంత నాణ్యమైన వంద కంప్యూటర్ గేమ్స్ ఆడే అవకాశం కూడా మైక్రోసాఫ్ట్  విండోస్11 లో ఉంది.

అంతర్జాతీయ స్థాయి నుండి స్థానిక వార్తల వరకు, సినిమా, వినోదం, వింతలూ విశేషాల సమహారాన్ని తెలుసుకునేందుకు కొత్త విడ్జెట్‌లను మైక్రోసాఫ్ట్ విండోస్ 11 లో ఏర్పాటు చేసారు, అలాగే ఇది వరకు అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ స్టోర్ ను పూర్తిగా పునరుద్దరించారు.

Microsoft windows 11

విండోస్ చరిత్రలోనే తొలిసారి ఆండ్రాయిడ్ యాప్స్ ను మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకునే సౌకర్యాన్ని విండోస్11 లో కలిపించారు.

విజువల్ స్టూడియో, డిస్నీ ప్లస్, అడూప్, జూం  వంటి తర్డ్‌పార్టీ యాప్స్ కూడా మైక్రోసాఫ్ట్ స్టోర్ లో అందుబాటులోకి రానున్నాయి, వీటి ద్వారా తమకి నచ్చిన సినిమాలు ప్రోగ్రాములను వీక్షకులు క్షణాల్లో వీక్షించవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

రాబోయే రోజుల్లో వర్చువల్ లర్నింగ్ ను సులభతరం చేయడం లో భాగంగా అమెజాన్ ఇంటెల్ బ్రిడ్జ్ సాంకేతిక లో భాగస్వాములు కానున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

విండోస్ 11 ను వినియోగించడానికి కావాల్సిన కనీస సిస్టమ్ కాన్ఫిగరేషన్ (Minimum system requirements) :

Processor : 1 Gigahertz  (GHz)
Memory : 4 GB RAM (Minimum)
Storage : 64 GB
Graphics card : DirectX 12/ WDDM 2.x
Display Size : > 9″ with HD Resolution (720p)

ఇది కూడా చదవండి : విజయవంతమయిన అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం