జాతీయం-అంతర్జాతీయం

White Fungus (వైట్ ఫంగస్ 2021) : దేశం లో మరో కొత్త వైరస్ కలకలం

White Fungus (వైట్ ఫంగస్ 2021) : దేశం లో మరో కొత్త వైరస్ కలకలం

వైట్ ఫంగస్ (White Fungus) కేవలం ఒక పురాణం మరియు అపోహ.  ఇది చాలా సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్.  ఇది ప్రాథమికంగా కాండిడా అనే ఒక రకమైన ఫంగస్ వల్ల కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్.

దాని యొక్క లక్షణాలు మరియు గుర్తులు ఎలా ఉంటాయి అంటే నాలుక లేదా నోటి మరియు గొంతు యొక్క ఇతర ప్రాంతాలపై తెల్లటి పాచెస్ ఉంటాయి. ఇతర లక్షణాలలో పుండ్లు పడటం మరియు మ్రింగుట సమస్యలు కూడా ఉండవచ్చు.

వైట్ ఫంగస్ ఇరుకైన మరియు తేమతో కూడిన ప్రదేశాలలో పెరుగుతుంది కాబట్టి మీ పరిసరాలు క్రమం తప్పకుండా శుభ్రం అయ్యేలా చూసుకోండి. రోజుల తరబడి శీతలీకరించిన తినదగిన పదార్థాలను తినడం మానుకోండి, తాజా పండ్లు తినండి.మీ ఇంట్లో సూర్యరశ్మిని ఉంచండి మరియు ప్రతిరోజూ మీ మాస్కుల ను ఉతకాలి.

బ్లాక్ ఫంగస్ మరింత ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది సాధారణంగా మానవ వ్యవస్థలో కనిపించదు మరియు మనం సాధారణంగా చాలా సందర్భాలలో చూడము. కాండిడియాసిస్ సులభంగా నిర్ధారణ అవుతుంది మరియు సులభంగా చికిత్స చేయవచ్చు, మీరు చికిత్స తీసుకున్నంతవరకు ఇది ప్రాణాంతకం కాదు, కాని తీసుకోకపోతే దాని లక్షణాలు ఎక్కువై అది హానికరంగా మారుతుంది.

వైట్ ఫంగస్ (white fungus) కంటే బ్లాక్ ఫంగస్ ప్రమాదకరమైనది, ఎందుకంటే మ్యూకోర్మైకోసిస్ చికిత్స 1-1.5 నెలలు కొనసాగవచ్చు. కోవిడ్-19  చికిత్సకు రోగులు తమ వైద్యులను సంప్రదించకుండా స్టెరాయిడ్లు తీసుకోవడం మానుకోవాలని వైద్యులు అన్నారు.

white fungus india

ఈమద్య కాలం లొ కరోనా వైరస్‌కు తోడు బ్లాక్ ఫంగస్ మరికొంత భయాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే కదా.ఈ రెండిటితొ పాటు కొత్తగా ‘వైట్ ఫంగస్’ అనే మరో కొత్త ఇన్ఫెక్షన్‌ను కరోనా వైరస్ సోకిన వారిలో కనిపెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు.

బీహార్‌ లోని పాట్నాలో 4 వైట్ ఫంగస్ కేసులను గుర్తించారు.బ్లాక్ ఫంగస్ లాగానే వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా చాలా ప్రమాదకరమైందని వైద్యులు చెబుతున్నారు, ఆ నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నా కాని టెస్టుల్లో మాత్రం నెగటివ్ అని వచ్చింది, ప్రస్తుతం వీరికి యాంటీ ఫంగల్ మందులు ఇస్తున్నారు, ఈ ఇన్ఫెక్షన్‌ వచ్చింది అని తెలుసుకోవాలంటే హెచ్ఆర్‌సీటీ (HRCT) స్కాన్ ద్వారానే సాధ్యం అని వైద్యులు చెబుతున్నారు.

అసలు వైట్ ఫంగస్ (White Fungus) అనగా ఏమిటీ?  అది మనుషులకి ఎలా సోకుతుంది?

white fungus Latests

1) బ్లాక్ మరియు వైట్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వాతావరణంలో ఉండే  ‘మ్యుకోర్మేసెటెస్’  అనే  శిలీంధ్ర  బూజుల  వల్ల తయారు అవుతున్నయి.

2) ఇది అంటువ్యాధి కానప్పటికీ, ఈ బూజును రోగులు సులభంగా పీల్చుకోగలుగుతారు.

3) ఈ వైట్ ఫంగస్ చాల వేగంగా మానవ శరీరంలోకి చేరి దాని ప్రభావం ను చూపిస్తుంది.

4) పరిశుభ్రంగా లేని వాతావరణం లో, నీటిలో ఈ ఫంగస్  ఉండే  అవకాశాలున్నాయి.

5) తక్కువ ఇమ్మ్యూనిటి  కలిగిన  మనుషులు ఈ వైట్ ఫంగస్ బారిన త్వరగా పడతారు.

6) ఈ బ్లాక్ ఫంగస్ ప్రమాదకరమే.  అయితే, ఈ వైట్ ఫంగస్ అనేది అంతకంతే యెక్కువ ప్రమాదకరమైనది.

7) ఇమ్మ్యూనిటి తక్కువగా ఉండేవారికి ఈ వైట్ ఫంగస్ చాల ప్రమాదకరమైనది.

8)ఇంకా వేరే వ్యాధులతో బాధపడుతూ, తక్కువ ఇమ్మూనిటి కలిగి ఉన్న వారికి వైట్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

9) షుగర్, క్యాన్సర్ రోగాలతో బాధపడేవారు స్టిరాయిడ్లను ఎక్కువగ తీసుకున్నా కూడా ఈ వైట్ ఫంగస్ సమస్య తప్పదు.

10)వైట్ ఫంగస్ సమస్య ఆడవాల్లకు, చిన్న పిల్లలకు కూడా ప్రమాదకరమని మరికొన్ని అద్యయనాలు చెబుతున్నాయి.

ఈ వైట్ ఫంగస్ (White Fungus) యొక్క లక్షణాలేమిటీ? బ్లాక్ ఫంగస్‌‌కు, దీనికి తేడా ఏమిటీ?

1) వైట్ ఫంగస్‌కు (White Fungus) కూడ  కరోనా లక్షణాలే ఉంటున్నాయి. ఇది కూడా ఊపిరితీత్తుల పైనే ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

2) వైరస్ లక్షణాలు ఉండి, కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగటివ్ వచ్చినట్లయితే తప్పకుండా వైద్యులను కలవాలి.

3) వైద్యులు ఎక్స్‌రే లేదా చెస్ట్ స్కాన్ ద్వారా శరీరంలోని ఫంగస్‌ను గుర్తించగలరు.

4) కొంతమందిలో వైట్ ఫంగస్ లక్షణాలు కూడా బ్లాక్ ఫంగస్ లాగానే ఉంటున్నాయి.

Also Read : కోవిడ్-19 ఆయుర్వేద ఔషధం : ఆనందయ్య