Etela About TRS Party
ఈ రోజు 10 గంటలకు ప్రెస్ మీటింగ్ నిర్వహించిన ఈటల, టీఆర్ఎస్ పార్టీ (TRS Party) సభ్యత్వానికి, ఎమ్మెల్లే పదవికి ఈటల రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
హుజురాబాద్ లో ఏ ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ ను గెలిపించానని, 19 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ లో వున్నానని, ప్రజలకు మంచి చేయాలని, ప్రజలను నమ్మి రాజకీయాలలోకి వచ్చానని, ఆ ప్రజలే నన్ను ఇంత కాలం గెలిపించారని, నేను ప్రజలను నమ్ముకొని కుట్రలు కుతంత్రాలు కలిగి వున్న పార్టీని వీడుతున్నానని, ఏనాడు పదవీ కోసం పార్టీ వీడలేదని, ఇప్పుడు పార్టీ మారిన ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నీ చూసుకుంటారని, ఏ పార్టీ లో లేకున్నా ప్రజలలో మమేకమే ప్రజలకోసం వుంటానని, ప్రలోభాలకు లోగనని ఆయన వివరించారు.
ఈనాడు ఎవరో ఒకరు రాసిన లేఖను సాక్ష్యంగా చూపి నన్ను ఓకే మాట కూడా అడక కుండా నా మీద విచారణ జరిపి నన్ను బర్తరఫ్ చేసి, నన్ను అవమాన పరిచారు, నాకు ఎటువంటి సంబంధము లేని విషయాలను, పనులను నా మీద పెట్టి నన్ను ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనా దుర్మార్గం అని ఆయన వివరించారు.
టీఆర్ఎస్ (TRS Party) లో మంత్రి పదవిలో వున్నా చాల అవమానాలను భరించానన్ని ఎన్నో సార్లు సీఎం ను కలవడానికి ఎమ్మెలేలతో తన ఇంటికి వెళ్తే గేట్ నుంచి తిప్పి పంపారని ఆయన ఆవేదన వ్వక్తం చేశారు.
ప్రగతిభవను ఒక బానిసల నిలయం అని అక్కడ ఎన్నో అవమానాలు, అన్ని దిగమింగానాన్ని అయినా నన్ను ప్రజలలో చెడవాడిగా చూపే ప్రయత్నం చేశారు, నన్ను బొంద పెట్టాలని ఆయన నా మీద అనవసర కేసులను పెట్టించి నా పరువు తియాలనే ఉద్దేశం తో ఈ పనులను చేయిస్తునారన్ని చెప్పారు.
కేసీఆర్ డబ్భులకు మాత్రమే విలువ ఇస్తారని అయన దళితుడిని సీఎం చేస్తానని ఇప్పటి వరకు మాట నిలపెట్టుకోలేదని, నేను నీ బానిసను కాదు నేను ని ఉద్యమ సహచరుడిని అని అయన ఈ సందర్బంగా చెప్పారు, కేసీఆర్ కు నాకు 5 సంవత్సరాల క్రితమే గ్యాప్ వచ్చిందని, రైతు బంధు విషయం లో వందల ఎకరాలు వున్న వారికి పథకం ఇవ్వకూడదని చెప్పానని, కాని అయన వినలేదని, ఇలా కొన్ని సందర్భాలాలో మాకు గ్యాప్ వచ్చిందని, వాళ్ళు కార్లలో వచ్చి రైతు బంధు డబ్భులు తీసుకపోవడం నాకు నచ్చలేదని చెప్పారు.
ఎమ్మెల్యే పదవి కి కూడా రాజీనామా చేసి తిరిగి గెలుస్తానని చెప్పారు, నేను హుజూరాబాద్ లో ఆరు సార్లు గెలిచానని, ఒక్క మద్యం బాటిల్ ఇవ్వలేదని అయన చెప్పారు, హుజూరాబాద్ లో ఈ సారి టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారు అన్ని అన్నారు, ఈటల తో పాటు మరి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోతున్నారని అయన చెప్పారు.