తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు తోడుగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. కరోనా కారణంగా గత సంవత్సరం షూటింగ్ లు నిలిచిపోయి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేసిన మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను ఈ సందర్బంగా సినీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. శనివారం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రి తలసానిని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో కలిసి ఇబ్బందుల తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్న తమకు అండగా నిలిచిన మిమ్మల్ని మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి తలసాని గారు మాట్లాడుతూ, కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుందని, అందరు దీనిని పాటించాలని కోరారు. అందరు మాస్క్ లు పెట్టుకోవడం, శానిటైజర్ ను ఉపయోగించడం లాంటి నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా కాపాడుకొవాలని సూచించారు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా సినీ ఇండస్ట్రీ పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారని, మమ్మల్ని కాపాడాలని ఆదుకోవాలని కోరారు.
తెలుగు సినీనటులతో తలసాని
అలాగే ప్రతి సినీ కార్మికుడికి కరోనా వ్యాక్సిన్ అందేలా చొరవ చూపాలని కోరారు. సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. మంత్రి తలసానిని కలిసిన వారిలో చిత్రపరిశ్రమ అధ్యక్షులు అనిల్ కుమార్, పీఎస్‌ఎన్, దొర, చిత్రపురి కాలనీ సెక్రటరీ కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు.