Mexican Fried Rice : మెక్సికన్ రైస్

mexican fried rice
పెళ్ళి కాని బ్యాచ్‌లర్లు సైతం సులభంగా చేసుకునే ఈ మెక్సికన్ రైస్ (Fried Rice) ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలిసిన పదార్థాలు (Fried Rice)  :

1) నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
2) వెల్లుల్లి – నాలుగు
3) ఉల్లిపాయ – ఒకటి (మీడియం సైజు)
4) టొమాటొ – రెండు
5) మిరియాల పొడి – ఒక టీ స్పూన్
6) కారం – ఒక టీ స్పూన్
7) చిల్లీ ఫేక్స్ – ఒక టేబుల్ స్పూన్
8) ఒరెగానో- ముప్పావు టీ స్పూన్
9) జీలకర్ర పొడి -అర టీ స్పూన్
10) ఉప్పు-ఒక టీ స్పూన్
11) పచ్చ క్యాప్సికం – పావు కప్పు
11) ఎర్ర క్యాప్సికం – పావు కప్పు
12) ఆకుపచ్చ క్యాప్సికం – పావు కప్పు
13) ఫ్రోజెన్ స్వీట్ కార్న్- పావు కప్పు
14) ఫ్రోజెన్ బఠానీ-పావు కప్పు
16) మెక్సికన్ బీన్స్- పావు కప్పు
17) ఆలెపినోస్- పావు కప్పు
18) ఉల్లిపొరక తరుగు-రెండు టేబుల్ స్పూన్లు
19) కొత్తిమీర తరుగు-రెండు టేబుల్ స్పూన్లు
20) నిమ్మరసం-అర స్పూన్
21) బాస్మతి బియ్యం-ఒకటిన్నర గ్లాసు.

అడుగు మందంగా ఉన్న గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల నూనె ను వేడి చేసుకోవాలి, ఇందులో నాలుగు వెల్లుల్లి సన్నని తరుగు వేసి 30సెకన్లు ఫ్రై చేయాలి, ఆ తరువాత మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేయాలి, దాన్ని ఓ నిమిషం పాటు వేపాలి, అంతకంటే ఎక్కువ వేపనవసరం లేదు.

తరువాత రెండు టొమాటోల పేస్టు (ముప్పావు కప్పు) వేసుకోవాలి, ఇందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫేక్స్, ముప్పావు టీ స్పూన్ ఒరెగానో, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి.

fried rice

టొమాటోల నుండి నీరు ఇగిరిపోయి నూనె పైకి తేలి టొమాటో ముద్దగా అవ్వాలి, అప్పటివరకు వేపితేనే రుచిగా ఉంటుంది.

3-4 నిమిషాల తర్వాత టొమాటో పచ్చి వాసన పోతుంది, అప్పుడు ఇందులో పావు కప్పు పచ్చ క్యాప్సికం, పావు కప్పు ఎర్ర క్యాప్సికం, పావు కప్పు ఆకుపచ్చ క్యాప్సికం వేసి రెండు నిమిషాలు వేపాలి.

ఒకటిన్నర కప్పులు గంట సేపు నాన బెట్టిన బాస్మతి బియ్యం ను వేసుకోవాలి. పెద్ద మంట మీద బియ్యం చెమ్మ ఆరేంత వరకు వేపుకోవాలి, బియ్యాన్ని మూడు నిమిషాలు వేపిన తరువాత రెండున్నర కప్పుల నీటిని పోసుకోవాలి.

అందులోనే పావు కప్పు ఫ్రోజెన్ స్వీట్ కార్న్, పావు కప్పు ఫ్రోజెన్ బఠానీ పావు కప్పు మెక్సికన్ బీన్స్ (రాజ్మా లాగా ఉంటాయి), ఇంకా రెండు స్పూన్ ల టొమాటో కెచప్ వేసి బాగా కలపి మూత పెట్టి పెద్ద మంట మీద సగం పైన ఉడకనివ్వాలి.

తరువాత అందులో పావు కప్పు ఆలెపినోస్, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపొరక తరుగు రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు అరచెక్క నిమ్మరం పిండి, మెతుకు విరగకుండా నెమ్మదిగా కలిపి మీడియం మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి.

ఆ తరువాత 15నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి, తాజా కార్న్, తాజా బఠాని వాడుతున్నట్లయితే ఉల్లిపాయలతో పాటే వేపుకోవాలి.

15 నిమిషాలు రెస్ట్ ఇచ్చాక చూస్తే ఎంతో కలర్‌ఫుల్ గా ఉండే మెక్సికన్ రైస్ (Fried Rice) రెడీ.

ఇది (Fried Rice) చాలా సువాసన తో ఉంటుంది, మరియు చాలా టెస్టీగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : సెన్సార్‌లనే తప్పుదోవ పట్టించిన కేటుగాళ్ళు