Covaxin : టీకా తీసుకున్నా భారతీయులకు విదేశాలకు NO ఎంట్రీ?

Flight Offers

Covaxin : అనేక దేశాలు తమ ప్రయాణ మరియు పర్యాటక రంగాలను తిరిగి ప్రారంబించి ప్రయాణికులను అనుమతిస్తున్నాయి మరియు వారి ఆరోగ్య మంత్రిత్వ శాఖల సిఫారసుల ఆధారంగా ప్రవేశానికి నిబంధనలు విదించే అవకాశం ఉంది. లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ (WHO)   యొక్క  అత్యవసర వినియోగ జాబితా ఇయుఎల్ (EUL)  జాబితాలో పేర్కొన్న  టీకాలు తీసుకున్న వారికి అనుమతి ఉంది.

కోవాక్సిన్ (Covaxin) తీసుకున్నా ఎందుకు అనుమతి లేదు?

కోవాక్సిన్ యొక్క రెండు డోసులను పూర్తిగా  తీసుకున్న వారికి అంతర్జాతీయంగా ప్రయాణించడానికి అనుమతించకపోవచ్చు, ఎందుకంటే ఒక నివేదిక ప్రకారం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితా (EUL) లో ఇప్పటివరకు చేర్చలేదు.

ఐరోపాలోని అనేక దేశాలు తమ ప్రయాణ మరియు పర్యాటకరంగాలను  తిరిగి ప్రారంభింస్తునారు మరియు ఆయా ఆరోగ్య విభాగాల సిఫారసుల ఆధారంగా ప్రయాణికుల ప్రవేశానికి నిబంధనలు విదించే అవకాశం ఉంది, డబ్ల్యూహెచ్‌ఓ (WHO) యొక్క  ఇ యు ఎల్ (EUL)జాబితాలో పేర్కొన్న  టీకాలు తీసుకున్న వ్యక్తులకు అనుమతి ఉంది.

భారతదేశం యొక్క ఇతర వ్యాక్సిన్ – కోవిషీల్డ్ – పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేత తయారు చేయబడినది , అది డబ్ల్యూహెచ్‌ఓ (WHO) యొక్క (EUL) లో ఉంది.

డబ్ల్యూహెచ్‌ఓ  గత సంవత్సరం డిసెంబర్ 31 న అత్యవసర ఉపయోగం కోసం ఫైజర్ / బయో ఎన్ టెక్ వ్యాక్సిన్‌లకు అనుమతిని ఇచ్చింది, ఫిబ్రవరి 15 న రెండు కోవిడ్ -19 టీకాలు ఆస్ట్రాజెనెకా / ఆక్స్ఫర్డ్ నుండి ఆస్ట్రాజెనెకా-ఎస్కెబియో (రిపబ్లిక్ ఆఫ్ కొరియా) మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేత ఉత్పత్తి చేయబడ్డాయి, మరియు జాన్విన్  జాన్సన్ చే   Ad26.COV2.S (కోవిడ్ -19 టీకా) అభివృద్ధి చేయబడినది.

రష్యా యొక్క రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) మరియు గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ మరియు భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ చేత అభివృద్ధి చేయబడిన భారతదేశ కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రైవ్ – స్పుత్నిక్-విలో ఇంకా రెండు టీకాలను UN  ఆరోగ్య సంస్థ ఆమోదించలేదు.

Covaxin

యూరోపియన్ యూనియన్ (ఇయు), యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కెనడా కూడా కోవాక్సిన్‌ను తమ ఆమోదించిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చలేదు. కోవాక్సిన్‌ను తన ఇయుఎల్‌ (EUL)లో చేర్చడం గురించి డబ్ల్యూహెచ్‌ఓ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

కోవాక్సిన్ (Covaxin) యొక్క డెవలపర్లు అయిన భారత్ బయోటెక్ ,వారి కోవిడ్ వ్యాక్సిన్‌ పూర్తిగా రెండు డోసులు తీసుకున్న వారిని డబ్ల్యూహెచ్‌ఓ (WHO) మరియు  అంతర్జాతీయంగా ప్రయాణించడానికి అనుమతించరని పేర్కొన్న నివేదికలను తిరస్కరించారు.

ముఖ్యముగా, కోవాక్సిన్ (Covaxin) తీసుకున్న ఏ భారతీయుడైనా డబ్ల్యూహెచ్‌ఓ(WHO)  ప్రీ-క్వాలిఫికేషన్ వచ్చేవరకు వారి దేశాలలోకి రావొద్దని ఏ దేశమూ చెప్పలేదు, కోవాక్సిన్ ఇప్పటివరకు 13 దేశాలలో అత్యవసర వినియోగ అధికారాలను పొందిందని హైదరాబాద్ బేస్ ఫెసిలిటి తెలిపింది.

కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా టీకాలు తీసుకున్న వారిని అంతర్జాతీయ ప్రయాణాన్ని అనుమతించడానికి వ్యాక్సిన్ పాస్పోర్ట్ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని చెప్పారు.

డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రీక్వాలిఫికేషన్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు అవసరం?

Covaxin

Know more about WHO COVID-19 Vaccines 

ఈ వారం ప్రారంభంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) కోవాక్సిన్ (Covaxin) వ్యాక్సిన్ కోసం అత్యవసర వినియోగ జాబితాను పొందటానికి డబ్ల్యూహెచ్‌ఓ (WHO) కు 90 శాతం డాక్యుమెంటేషన్‌ను సమర్పించినట్లు ప్రకటించింది .మరియు మిగిలిన వివరాలు వచ్చే నెలలో తెలియచేయబడతాయి.

ఒక దేశం కొనుగోలు చేయాలనుకుంటే, ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన టీకా యొక్క నాణ్యతను ధృవీకరించడం ప్రతి దేశానికి సాధ్యమయ్యేది కాదు . అందువల్ల, సభ్య దేశాలు నాణ్యత, భద్రత మరియు సమర్థత విషయం లో డబ్ల్యూహెచ్ఓ (WHO) ను అంతర్జాతీయ ప్రమాణాలను ధృవీకరించడానికి ఒక నిర్నయం తీసుకోవాలని ఆదేశించాయి.అపుడు టీకాల కోసం PQ (ప్రీ-క్వాలిఫికేషన్) ప్రోగ్రామ్ 1987 లో ప్రారంభించబడింది.

“HIV/AIDS  మహమ్మారి నేపథ్యంలో, 2001 లో మెడిసిన్ కోసం ఇదే విధానాన్ని అనుసరించారు. అప్పటి నుండి, డబ్ల్యూహెచ్ఓ (WHO)  PQ  లో ఇన్ విట్రో డయాగ్నస్టిక్స్, ఇతర వైద్య పరికరాలు మరియు వెక్టర్ కంట్రోల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు”.

ఇది కూడా చదవండి : Top 10 Smartphone India