Cabinet of Telangana : లాక్‌డౌన్ జూన్ 9th వరకు పొడిగింపు (నియమాలు మరియు సడలింపులు)
ప్రగతిభవన్‌లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయింది. లాక్‌డౌన్ పొడిగింపుతో పాటు కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ పైనా ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ (Telangana) ప్రగతిభవన్‌లో మంత్రులతో సమావేశమయిన ముఖ్యమంత్రి కేసిఆర్ లాక్‌డౌన్ పొడిగింపుతో పాటు కరోనా కట్టడి వివిధ అంశాలపై 4 గంటల పాటు చర్చించారు, రాష్ట్రంలో మే 12 నుంచి అమలవుతున్న లాక్ డౌన్ సెకండ్‌వేవ్ తొ జనం ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.
ఉదయం 6 నుంచి 10 వరకు వున్న సడలింపు ను పొడగించాలని పలువురు జిల్లా నేతలు సలహను దృష్టిలో వుంచుకొని సడలింపు గంటలను పొడిగించే విషయం కూడా చర్చించిన క్యాబినెట్, వ్యవసాయానికి ఇది అనువయిన సమయం కావడంతో, రెత్తులకు మరియు వ్యవసాయ సంబంధ ఎరువుల ఇతర వస్తువుల దుకాణాలకు సడలింపులపై కూడా సమాలొచన చేసినది క్యాబినెట్.
వ్యాక్సిన్ డోసుల ప్రక్రియను తొందరగా పూర్తి చేయలనే ఆలొచనలో వున్న రాష్ట్ర ప్రభుత్వం, 45 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి రెండవ మోతాదు కొంత వరకు పూర్తి అయినందున మిగతా వారికి తొందరగా పూర్తి చేయాలని స్పష్టమైన అదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసిఆర్, 18 సంవత్సరాల వారికి కోవిడ్ వ్యాక్సినేషను త్వరగా ప్రారంభించాలని అదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసిఆర్.
కార్మిక వర్గాలను మరియు రోజు వారి కూలీలను దృష్టిలో వుంచుకొని కొన్ని సడలింపులు ఇవాలనే ఆలొచన చేసినది రాష్ట్ర ప్రభుత్వం.
Telangana రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయాలు
- BC రిజర్వేషనలను మరో 10 రోజులు పొడిగింపు నిర్ణయానికి క్యాబినెట్ ఆమోద ముద్ర.
- లాక్‌డౌన్ జూన్ 9th వరకు పొడిగింపు, ఉదయం 6 నుంచి 10 వరకు వున్న సడలిం’\పు ను, ఉదయం 6 నుంచి 1 వరకు పెంచాలని నిర్ణయించారు, 2 గంటల నుంచి లాక్‌డౌన్ అమలు, ఇళ్లకు చేరుకునేందుకు గంట సమయం.
- వీకెండ్ సంపూర్ణ లాక్‌డౌన్‌కు సమర్దించని క్యాబినెట్.
- జూన్ 2 న రాష్ట్ర అవతరన దినోత్సవాన్ని నిరడంబరంగా కోవిడ్ నిబంధలను పాటిస్తు జరపాలని నిర్ణయించారు.