విమానం లో వివాహంపై వివరణ ఇచ్చిన స్పైస్‌జెట్
కరోనా కాలంలో వివాహాలు చేసుకొనే వారికి చాలా ఇంబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు పరిమిత సంఖ్యతో వివాహాలు చేసుకుంటే, కొంత మంది ఆన్‌లైన్ ద్వారా వివాహాలు చేసుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన రాకేశ్-దక్షిణా వివాహం మాత్రం విమానం లో జరిగింది. వివాహం కోసం తుత్తుకూడికి విమానం లో బయలుదేరిన వీరికి లాక్ డౌన్ రూపంలో చుక్కెదురయింది. దీనితో విమానం లోనే వివాహం చేసుకోవాలని అనుక్కున్నారు. వెంటనే విమానం లోనే వున్న 161 మంది అతిధుల సమక్షంలో వధువు మేడలో తాళి కట్టాడు వరుడు రాకేశ్, ఈ పెళ్లి ఫోటోస్ వీడియోలు వైరల్ అవ్వడంతో. కోవిడ్ నిబంధనలను అధిగమించి 161 మంది ప్రయాణికులతో వివాహం జరగడాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తునకు ఆదేశించింది.
DGCA Official to SpiceJet
“SpiceJet ఫ్లైట్ యొక్క సిబ్బంది మరియు కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఎయిర్ లెన్స్ ను సూచించబడింది”. అన్ని సీనియర్ DGCA అధికారి చెప్పారు.
ఈ విషయంప్తె స్పదించిన స్పైస్‌జెట్ యాజమానం వివరణ :
వారు వివాహం చేసుకుంటామని ముందుగా చెప్పలేదని, ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని, అయినా ఈ వివాహనికి సహకరించిన విమాన సహాయ సిబ్బందిని విధుల నుంచి తొలగించామని వివరించింది, వధూవరులతో సహా అతిధుల మీద కేసు నమోదు చేసి విచారణ చేసున్నట్టు తెలిపింది.