జాతీయం-అంతర్జాతీయం

Statue of Unity : ప్రపంచంలో ఎతైన విగ్రహం రికార్డు మనదే

Statue of Unity

స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఇది గుజరాత్ లో ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళిగా విగ్రహాన్ని నిర్మించారుఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా 143 జయంతి సందర్భంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ను ప్రారంభించారు, విగ్రహం దాని పేరుకు తగ్గట్టుగా గొప్పగా రికార్డులను మరియు కీర్తిని కలిగి ఉంది.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) దగ్గరికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారుఇది 182 మీటర్ల పొడవు ఉంటుంది దీనిని సుమారు 3000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ అహ్మదాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో, నర్మదా నది తీరాన ఉంది, స్టాట్యూ ఆఫ్ యూనిటీ 33 నెలల రికార్డు సమయంలో నిర్మించబడింది, ఇది భారత ఇంజనీర్లు మరియు వారి బృందం యొక్క సమిష్టి కృషి.

Statue of Unity టికెట్ ధర మరియు సమయాలు :

ఇక్కడ మూడు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క ప్రాథమిక ప్రవేశ టికెట్ ధర పెద్దలకు Rs 150/- మరియు 3 నుండి 15 సంవత్సరాల మధ్య పిల్లలకు ధర Rs 90/- గా ఉంది, ఈ టికెట్ ద్వార అబ్జర్వేషన్ డెక్ వ్యూ, మెమోరియల్, మ్యూజియం,  ఆడియోవిజువల్ గ్యాలరీ, ఫ్లవర్ లోయ చూడవచ్చు.

వీక్షణ గ్యాలరీ: పెద్దలకు మరియు పిల్లలకు Rs 230/- గా ఉంది.

ఎక్స్‌ప్రెస్ ఎంట్రీకి పిల్లలకు Rs 380/- గాను వయోజనులకు Rs 1030/- గాను ఉంది.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ మంగళవారం నుండి ఆదివారం వరకు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు తెరిచి ఉంటుంది.

Statue of Unity

స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) చేరుకోవడం ఎలా  అంటే? 

గుజరాత్ లోని కెవాడియా అనే చిన్న పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహం ఉంది, ఇది రాజ్‌పిప్లా అనే నగరం కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది అహ్మదాబాద్ కు 200 కి.మీ దూరం లో, సూరత్ కు 150 కి.మీ దూరం లో, వడోదర కు 90 కి.మీ దూరం లో ఉంది.

ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి కెవాడియా నుండి బస్సు ఉంటుంది, మరియు అక్కడ నుండి స్థానిక ఆటోలు స్టాట్యూ ఆఫ్ యూనిటీ  చేరుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. వడోదర నుండి రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయం ద్వారా స్టాట్యూ ఆఫ్ యూనిటీని చేరుకోవచ్చు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ భారతదేశం యొక్క ఇనుప (ఉక్కు)మనిషి – సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా నిర్మించబడింది, సుమారు 2000 సర్దార్ పటేల్ జీవిత చరిత్ర  ఛాయాచిత్రాలు మ్యూజియం లో ఉన్నాయి.

ఇక్కడ అద్భుతమయిన పువ్వులతో నిండివున్న లోయను చూడవచ్చు, ఇది సువాసనతో వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సర్దార్ సరోవర్ డ్యామ్ వ్యూపాయింట్ నుండి చూస్తే 256 కిలోమీటర్ల పొడవైన వింధ్యా సత్పురా పర్వత శ్రేణులు కనిపిస్తాయి.

కొన్ని ఆసక్తికరమయిన విశేషాలు :

-> స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అని అందరికీ తెలుసు, కాని ఇది అతిపెద్ద స్మారక కట్టడాలలో ఒకటి అని కొద్ది మందికి మాత్రమే తెలుసు.

-> ఇది ప్రసిద్ధ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే 89 మీటర్లు మరియు చైనా యొక్క స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహానికి 29 మీటర్లు పెద్దదిగా ఉంటుంది.

-> లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టి) కు చెందిన 300 మంది ఇంజనీర్లు మరియు సుమారు 3000 మంది కార్మికులు ఈ విగ్రహాన్ని నిర్మించారు.

-> 1,69,000 గ్రామాల్లోని మిలియన్ల మంది రైతుల నుండి సుమారు 129 టన్నుల ఇనుము ను తీసుకొని దీనిని నిర్మించారు .

-> రాబోయే 100 సంవత్సరాలలో, స్టాట్యూ ఆఫ్ యూనిటీ తన సహజ వృద్ధాప్య ప్రక్రియ కారణంగా ఆకుపచ్చగా మారుతుంది.

-> ఈ విగ్రహం భూకంపాని మరియు సెకనుకు 100 కి.మీ గాలి వేగాన్ని తట్టుకుంటుంది.

-> విగ్రహంలో హై-స్పీడ్ లిఫ్ట్‌లు అమర్చబడి ఉండడం వల్ల 30 సెకన్లలో 26 మందిని పైకి తీసుకెళ్లవచ్చు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) అనేది ప్రపంచంలోని ఇతర స్మారక చిహ్నాలతో సరిపోలని ఒక అద్భుతం. జీవితం లో ఒక్కసారి అయిన ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించండి.

ఇది కూడా చదవండి : ఆసియాలో 5 అతిపెద్ద షాపింగ్ మాల్స్