జాబ్స్ & ఎడ్యుకేషన్

Indian Navy 2021 : భారత నేవీ లో ఉద్యోగాలు

Indian Navy
Indian Navy : కేవలం పదో తరగతి అర్హతతో భారత నేవీ లో ఉద్యోగం పొందే అవకాశం, జీతం అరవై వేల వరకు ఉండొచ్చు.

భారత నేవీ పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

పదో తరగతి అర్హత తో తీసుకోనున్న ఈ భర్తీలకు పెళ్ళికాని పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మొత్తం మూడు వందల యాభై ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

Indian Navy భర్తీ చేయనున్న పోస్టులు, వాటి అర్హతలు:

# మొత్తం 350 ఖాళీల్లో చెఫ్,హైజీనిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

# ఈ చెఫ్, హైజీనిస్ట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాస్ అవ్వడం తో పాటు భారత నేవీ (Indian Navy) సూచించిన శారీరక ప్రమాణాలు(బాడీ బిల్డింగ్) కలిగి ఉండాలి.

# అభ్యర్థులు ఏప్రిల్1, 2001 ఉండి సెప్టెంబర్ 30, 2004 మధ్య పుట్టిన వారై ఉండాలి.

# చెఫ్, హైజీనిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయం లో నెలకు రూ.14,000 స్టైఫండ్ గా చెల్లిస్తారు, ట్రైనింగ్ తరువాత వారి విభాగాలను అనుసరించి రూ.21,700 నుంచి 69,100 లుగా చెల్లిస్తారు.

Indian Navy

మరి కొన్ని ముఖ్యమైన అంశాలు :

#  అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఈ ప్రక్రియ జులై 19,2021 న మొదలై జులై 23, 2021 న ముగియనుంది.

# అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష పెడతారు, ఇందులో పాస్ అయిన వారికి మాత్రమె ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు, ఇందులో కూడా పాస్ అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహించి ట్రైనింగ్ కి పంపుతారు.

# ట్రైనింగ్ కి అభ్యర్థులు, ఐఎన్ఎస్ చిల్కా లో 12వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు, తదుపరి బ్రాంచ్/ట్రేడ్ల వారీగా విధుల్లోకి తీసుకుంటారు.

# రాత పరీక్ష హిందీ, ఇంగ్లీష్ లో నిర్వహిస్తారు.

# ఈ పరీక్ష సామన్య, మరియు గణిత, జనరల్ నాలెడ్జ్, విభాగాల్లో ఉంటుంది.

# మెడికల్ టెస్ట్ లో భాగంగా ఆ అభ్యర్థి ఏడు నిమిషాల్లో, 1.6కిమీ ల దూరం పరుగెత్తాలి, 20స్క్వాట్స్ , 10 పుష్ అప్స్ ఆ అభ్యర్థి చేయవలసి ఉంటుంది.

ఇది కూడా చదవండి : అమెజాన్ కు అలెక్సా తో చిక్కులు