లైఫ్ స్టైల్

Banana Benefits (8) : అందానికి వేల ఖర్చువద్దు ఒక్క అరటితొక్కచాలు

banana benefits
Banana Benefits: మనం సాధారణంగా అరటిపండు తిన్న తరువాత దాని తోలు ను పడేస్తాం, కాని ఆ తోలు లో చాలా ఉపయోగాలు, మిరాకిల్స్ ఉన్నాయి, అవి తెలిస్తే ఇంకెప్పుడు వేస్ట్ అని బయట పడేయరు.

ఇప్పుడు ఆ తోలు వల్ల ఉపయోగాలేంటో చూద్దాం.

1.మొటిమల నివారణ

Banana Benefits

ఈ అరటితొక్క లో విటమిన్ సి,విటమిన్ ఇ,పొటాషియం, జింక్, ఐరన్, మాంగనీస్ ఉంటాయి.

చెమట వల్ల కాని, దుమ్ము ధూళి వల్ల కాని మనం సరిగా శ్రద్ధ చూపెట్టకపోతే మొటిమలు వస్తుంటాయి, అవి పోవాలంటే మొదటగా మొహం శుభ్రంగా కడుక్కొని టవల్ తో తుడుచుకున్న తరువాత అరటితొక్క మీద పెరుగు వేసి దానిని మొహం మీద నెమ్మదిగా ఒక నిమిషం పాటు మర్దన చేయాలి.

ఒక నిమిషం పాటు రుద్దుకున్న తరువాత పదినిమిషాలు ఆగాలి, తరువాత మొహాన్ని చల్లని నీటితో కడిగేయాలి, ఇలా క్రమంగా చేస్తుంటే మొటిమలు తొందరగా తగ్గుముఖం పడుతాయి, మరియు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గుతాయి.

Banana Benefits: ఈ అరటితొక్క లో ఉండే యాంటి అక్సిడెంట్స్, విటమిన్స్ మొటిమలను తగ్గిస్తాయి, వారం రోజుల్లోనే ఫలితాలను చూడవచ్చు.

2.కళ్ళ కింద వాపు(పఫ్ఫీనెస్)ను తగ్గించడానికి

Banana Benefits

Banana Benefits:  చాలా మందికి కళ్ళ కింద వాపు లాగా ఉంటుంది, అది అరటితొక్క తో సులభంగా పోగొట్టవచ్చు, అరటితొక్క ను అర్ధ చంద్రాకారం లో కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్ లో 15 నుండి 20నిమిషాలు పెట్టాలి, అవి బాగా చల్లగా అయ్యాక కళ్ళ కింద పది నిమిషాలు పెట్టుకోవాలి, తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి, ఇలా రెగ్యులర్‌గా కళ్ళ కింద వాపు తగ్గుతూ వస్తుంది.

3.పులిపిర్లను తొలగించడానికి

Banana Benefits

Banana Benefits:  చాలా మంది పులిపిర్ల తో బాధ పడుతూ ఉంటారు, ఈ అరటితొక్క పుపిపిర్లకు అధ్భుతంగా పని చేస్తుంది, అరటితొక్క ను చిన్నగా కట్ చేసి దానిని పుపిర్ల మీద ఉంచి అది కదలకుండా సెల్లో టేప్ తో సీల్ చేయాలి, దానిని అలా రాత్రంతా ఉంచి తరువాత రొజూ ఉదయం తీసేసి కడిగేయాలి, ఇలా చేస్తుంటే పులిపిర్లు రాలి పడిపోతాయి.

4.గోర్లు పెరుగుదలకు

Banana Benefits

Banana Benefits: చాలా మంది గోర్లు పెంచుకోవాలనుకుంటారు, కాని అవి పెలుసుగా ఉండి పెరగగానే విరిగిపోతుంటాయి, గోర్లను ధృడంగా చేయడానికి అరటితొక్క చాలా బాగా ఉపయోగ పడుతుంది, అరటితొక్క లోపల ఉన్న ఫైబర్ భాగాన్ని తీసుకోని ఒక గిన్నెలో వేసుకోని అందులోకి వెల్లుల్లిపాయ తురుముని వేసుకోవాలి, వాటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని గోర్లమీద 5నిమిషాల పాటు మసాజ్ చేయాలి, తరువత కడిగేసి గోర్ల మీద కొబ్బరి నూనె రాయాలి.ఇలా చేస్తుంటే గోర్లు బాగా ధృడంగా పెరుగుతాయి.

5.మెరిసే తెల్లని పళ్ళ కోసం :

Banana Benefits

Banana Benefits:  చాల మందికి కాఫీలు, టీ లు ఎక్కువగా తాగడం వల్ల, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల పళ్ళు తెల్లగా కాకుండా పచ్చగా మారిఉంటాయి, అరటితొక్క లోపలి భాగంతో పళ్ళ మీద ప్రతీ రోజూ వారం పాటు రుద్దాలి, ఇలా రుద్దాక మములుగా బ్రష్ చేసేసుకోవాలి, ఇలా కొద్ది రోజులు చేస్తే పళ్ళు తెల్లగా మారుతాయి.

6.లెదర్ బ్యాగుల పాలిషింగ్ కోసం:

Banana Benefits

Banana Benefits: లెదర్ బ్యాగులు వాడుతుంటే వాటి మెరుపు తగ్గిపోతుంది, తక్షణంగా మెరుపు, పాలిషింగ్ రావడం కోసం అరటితొక్క లోపలి బాగంతో బాగా బ్యాగ్ మీద రుద్దితే మంచి షైనింగ్ వస్తాయి, కాసేపు ఆగి ఒక పొడి బట్ట తో తుడిచేయాలి, తరువాత సర్ఫ్ నీటితో తుడిచేస్తే అరటిపండు వాసన రాకుండా ఉంటుంది.

7.ముడతల నివారణకు

Banana Benefits

Banana Benefits:  కొంతమందికి చిన్న వయసులోనే నుదురు భాగం లో ముడతలు కనిపిస్తుంటాయి, అరటి తొక్క లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్,విటమిన్స్ ఈ ముడతలను పోగొట్టడం లో బాగా ఉపయోగపడుతాయి, అరటి తొక్క ను తీసుకోని ముడతల మీద ఒక 5 నిమిషాలు రుద్ది పది నిమిషాలు ఉంచుకున్న తరువాత కడిగేసుకోవాలి, తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, ఇలా వాఆనికి మూడు సార్లు చేస్తే ముడతలు క్రమంగా తగ్గిపోతాయి, ముడతలు తగ్గి చర్మం బిగువుగా అవుతుంది, ఇలా చేస్తే నలభై ఏళ్ళ వయసులో కూడా ఇరవై యేళ్ళ వయసు వారిల అనిపిస్తారు.

8. ఎరువు ( ఫర్టిలైజర్ ) గా వాడకానికి

Banana Benefits

Banana Benefits:  అరటి తొక్కలు అన్నిటిని చిన్న చిన్న ముక్క ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక సీసా తీసుకోని ఆ ముక్కల్ని ఆ సీసా లో వేయాలి, ఆ ముక్కలు మునిగే విధంగా నీటిని పోసుకోవాలి, ఆ సీసాను కదపకుండా వారం రోజుల పాటు పక్కన పెడితే ఫర్టిలైజర్(ఎరువు) తయారవతుంది, నీటిని ఫిల్టర్ చేసి చెట్లకు పోస్తే చెట్లు బాగా పెరుగుతాయి, పూలు కూడా బాగా పూస్తాయి.

ఇది కూడా చదవండి : అబ్బా! వెల్లుల్లి వేస్ట్ తో ఇన్ని అద్భుతాలా